లెక్చరర్ పోస్టులకు పీడీ పోస్టుల బదలాయింపు
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:03 AM
ఇంటర్మీడియట్ విద్యలో భాగమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ శాశ్వతంగా దూరం కానుంది. ఇంటర్మీడియట్‌లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను జూనియర్ లెక్చరర్లుగా బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఆందోళనలో పీఈటీ సంఘ ప్రతినిధులు, క్రీడాకారులు
శ్రీకాకుళం స్పోర్ట్స్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యలో భాగమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ శాశ్వతంగా దూరం కానుంది. ఇంటర్మీడియట్‌లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను జూనియర్ లెక్చరర్లుగా బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తద్వారా రాష్ట్రంలో ఖాళీగా మొత్తం 199 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు మాయమయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు వస్తే గత ఏడాది వరకు 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, అందులో దశాబ్ద కాలం నుంచి జిల్లాలోని 16 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వాటిని భర్తీ చేయకుండా గత ప్రభుత్వా లు కాలాయాపన చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 199 పీడీ పోస్టుల ను ఇతర సబ్జెక్టులకు మార్పు చేయడంతో ఇంటర్మీడియట్‌లో ఇంచుమించు ఫిజికల్ ఎ డ్యుకేషన్ పోస్టులు భూస్థాపితం అయినట్లేన ని క్రీడాకారులు, పీఈటీలు అభిప్రాయపడు తున్నారు. దీంతో ఎంపీఈడీ చదువుకున్న విద్యార్థులకు, ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న పీఈటీల ఆశలన్నీ నీరుగారినట్టే. అండర్-19 ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు, అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించడానికి జిల్లా అంతటా ఒక్క ఫిజికల్ డైరెక్టర్ ఇప్పటి వరకు లేరు. ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్వహించే ఎస్‌జీఎఫ్ అండర్-19 ఎవరు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
హైస్కూల్ స్థాయితోనే సరి..
ఉన్నత పాఠశాల వరకు చురుగ్గా గ్రిగ్స్ పోటీలు, స్కూల్ గేమ్స్ పోటీలు పాల్గొంటున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో పూర్తిగా పీడీలు లేకపోవడం హైస్కూల్ నుంచే క్రీడలు ఆపేయాల్సి ఉంటుందని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ప్రాతిపదికన 30 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, నేరుగా 70 శాతం పోస్టులు ఎంపీఈడీ పూర్తయిన విద్యార్థులకు అవకాశం ఉంటుందని పీఈటీ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభు త్వం పీడీ పోస్టులకు ఇతర సబ్జెక్టులకు కన్వర్షన్ చేయడం వల్ల ఏకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ నిర్వీ రం అయిపోతుందని జిల్లా వ్యాయామ ఉపాధ్యా య సంఘం అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశా రు. జేఎల్ నోటిఫికేషన్‌లో జేఎల్ పీడీ పోస్టులు భర్తీ చేయాలని పీఈటీ సంఘం ప్రతినిధులను ఎంపీడీ పూర్తి చేసిన పీఈటీలు కోరారు. ఈ మేరకు సోమవారం వినతి పత్రాన్ని అందించారు.