MLA: తూలి కిందపడ్డ సూళ్లూరుపేట ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:14 PM
సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె తూలి కిందపడ్డారు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. గాయమైనచోట రక్తం కారుతుండడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

- విజయశ్రీకి స్వల్ప గాయాలు
- శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఇంట్లో ఘటన
తడ(నెల్లూరు): సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ(Sullurpet MLA Dr Nelavala Vijayasri) తూలి కిందపడడంతో స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో మంగళవారం జరిగిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయశ్రీ వెళ్లారు. కారుదిగి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో ప్రధాన గడప వద్ద తూలి కింద పడిపోయారు. ముఖం నేలకు కొట్టుకుని స్వల్ప గాయాలయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: అయోధ్య బాల రాముడికి వెండి కిరీటం
ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(Srikalahasti MLA Bojjala Sudheer Reddy) వెంటనే వచ్చి విజయశ్రీని పైకి లేపారు. గాయమైన చోట రక్తం కారుతుండడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న విజయశ్రీ సాయంత్రం నాయుడుపేటలోని స్వగృహానికి వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
Read Latest Telangana News and National News