ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నుల పండువగా ప్రభల ఉత్సవం

ABN, Publish Date - Jan 16 , 2025 | 05:21 AM

కనుమ సందర్భంగా బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 170గ్రామాల్లో ప్రభల తీర్థాలను కన్నుల పండువగా నిర్వహించారు.

  • జనసంద్రంగా జగ్గన్నతోట

అంబాజీపేట, జనవరి 15(ఆంధ్రజ్యోతి): కనుమ సందర్భంగా బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 170గ్రామాల్లో ప్రభల తీర్థాలను కన్నుల పండువగా నిర్వహించారు. అంబాజీపేట మండలం మొసలపల్లిలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో కొలువుతీరాయి. ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి వచ్చే చెన్నమల్లేశ్వరస్వామి, వీరేశ్వరస్వామి ప్రభలు పచ్చని చేలను తొక్కుకుంటూ పంట కాలువను దాటిస్తున్న తీరు చూపరులను పారవశ్యానికి గురిచేసింది. మిగిలిన ప్రభలను ఆయా గ్రామాల్లో ఊరేగింపుగా తీర్థానికి తీసుకువచ్చారు. శిలాతోరణాలు, వరికంకులు, గుమ్మడికాయ, పలురకాల పూలమాలలతో ప్రభలను అలంకరించారు. మండంలోని వాకలగరువులో 42అడుగులకు పైగా ఉన్న తొండవరం, వాకలగరువు ప్రభలు తీర్థంలో కొలువుదీరాయి.

Updated Date - Jan 16 , 2025 | 05:21 AM