Share News

TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:26 AM

తిరుపతిలో గోవుల తొక్కిసలాటకు గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి కారణమని, దీని వెనుక కుట్ర ఉండొచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు అనుమానించారు. గత టీటీడీ చైర్మన్‌ హిందువు కాదని, టీటీడీపై రాజకీయ ఆరోపణలు చేస్తుండటం సరికాదన్నారు.

TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!

గోవుల మృతిలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదు

భూమనపై చట్టపరమైన చర్యలు: టీటీడీ చైర్మన్‌

తిరుపతి(టీటీడీ), ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు ముఖ్య కారకుడు గోశాల డైరెక్టర్‌ హరనాథరెడ్డి అని, దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని టీటీడీ చైౖర్మన్‌ బీఆర్‌ నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలను ఆయన ఆదివారం సందర్శించి, గోవులను పరిశీలించారు. అక్కడి అధికారులతో సమీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గతంలో హిందూ వ్యతిరేక వ్యక్తి టీటీడీ చైర్మన్‌ కావడం మనందరి దురదృష్టమని అన్నారు. ‘ఆయన హిందువు కాదు. కుమార్తెకు ఏ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు టీటీడీ గురించి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా పోరాటం చేయాలి కానీ టీటీడీపై ఆరోపణలు చేయడమేంటి? టీటీడీ ఇంజనీరింగ్‌ విభా గం ద్వారా రూ.1,600 కోట్లు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారు. గడువు ముగిసిన మందులు, పురుగులు పట్టిన దాణా ఇచ్చిన వ్యక్తి గోవుల గురించి మాట్లాడుతున్నారు. కొన్ని సహజంగా, మరికొన్ని అనారోగ్యంతో, వృద్ధాప్యంతో చనిపోవడం సాధారణం. ఇందులో టీటీడీ నిర్లక్ష్యం ఏమీ లేదు. ఇలాంటి వ్యక్తి భూమి పై పుట్టకూడదని స్వామివారిని కోరుకుంటున్నా. హిందూ మతంపై పడటం కాదు. వేరే మతస్తులపై పడితే తెలుస్తుంది. కరుణాకర్‌ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడో చనిపోయిన గోవులను ఇక్కడివే అన్నట్లు చూపిస్తున్నారు’ అని విమర్శించారు.


తిరుమలను ధనార్జన క్షేత్రంగా మార్చేశారు

2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చిందని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. భగవంతుడిపై నమ్మకం, విశ్వాసం లేని వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారని మండిపడ్డారు. తిరుపతి రోడ్లు, టీటీడీ గోవిందరాజ సత్రాల కమీషన్లతో తన కుమారుడి ఎన్నికల ఖర్చు పెట్టుకున్న వ్యక్తి.. 3నెలల్లో వంద గోవులు చనిపోయాయని ఆరోపించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమలకు, ఒంటిమిట్టలో కల్యాణానికి సతీసమేతంగా మీ నాయకుడిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పురుగులు పట్టిన దాణాను ఆవులకు పెట్టకూడదని 2024 ఏప్రిల్‌ 1న విజిలెన్స్‌ నివేదికలో ఉంటే అప్పడెలా పెట్టారంటూ వీడియోలు విడుదల చేశారు. అసత్య ప్రచారంలో ఎవరెవరు ఉన్నారో వారి కాల్‌ డేటా ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గొల్ల నరసింహయాదవ్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, మహేశ్‌ యాదవ్‌ తదితరులు టీటీడీ చైర్మన్‌ను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:26 AM