Share News

Andhra Pradesh Weather: వానలు.. వడగాడ్పులు

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:29 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురిశాయి. గాలివానలతో చెట్లు విరిగి రైలు మీద పడగా, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. పలు మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Andhra Pradesh Weather: వానలు.. వడగాడ్పులు

ఉత్తరాంధ్రలో వడగళ్లవాన.. ప్రకాశంలో గాలివాన బీభత్సం

కోస్తా, సీమల్లో కొనసాగిన ఎండ తీవ్రత

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం ఓ వైపు ఎండలు మండిపోగా, మరోవైపు అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ అనిశ్చితితో కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలో అల్లూరి జిల్లా సహా అక్కడక్కడా వడగండ్ల వాన కురిసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 43మి.మీ., అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండ తీవ్రత పెరిగింది. ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8, కడప జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4, అన్నమయ్య జిల్లా వత్తలూరు, నంద్యాల జిల్లా పాములపాడులో 41.2, నందిగామలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఎండ రికార్డు అయ్యింది. సోమవారం ఉత్తరాంధ్ర, కోస్తాలోని 11 మండలాల్లో తీవ్రంగా, 98 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక, ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో బొప్పాయి తోటలు ధ్వంసమవడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. కనిగిరిలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి డబ్బుగొట్టు వెంకట లక్ష్మమ్మ (55) అనే మహిళ మృతి చెందింది.


gthly.jpg

రైలుపై విరిగిపడిన చెట్టు

కైకలూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగిపోయి విద్యుత్‌ లైన్లు ధ్వంసం కావడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఆదివారం రాత్రి 8.45 గంటలకు కైకలూరు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం-1 పైకి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చిన సమయంలో భారీ వర్షంతోపాటు ఈదురుగాలులకు స్టేషన్‌ను ఆనుకుని ఉన్న సరుగు చెట్టు విరిగి విద్యుత్‌ లైన్‌పై పడింది. అనంతరం రైలు బోగీపై పడింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఆ చెట్టును తొలగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:29 AM