Vignan Students Excel: విజ్ఞాన్ ప్రభంజనం
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:13 AM
విజ్ఞాన్ విద్యాసంస్థలో విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. వి.కౌశిక్ 992 మార్కులు సాధించి టాప్‌గా నిలిచారు, 56 మంది 980 మార్కులకు పైగా సాధించారు

గుంటూరు(విద్య), ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వి.కౌశిక్ (992) మార్కులు, ఎం.అఖిలేష్ (989), జీ.నాగేంద్ర గుప్త (989), ఎన్.నాగ మోక్షజ్ఞ(989)తో పాటు 56 మంది 980 మార్కులు పైగా సాధించారని వెల్లడించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎస్‌డీ మహమ్మద్ అష్రఫ్ (465) మార్కులు, టీడీఎ్‌సఎన్‌పీ లక్ష్మణ్ నారాయణ (465), పీ.పూజిత (465)తో పాటు 45 మంది విద్యార్థులు 460 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.