Vijay Deverakonda: యువత మత్తుకు దూరంగా ఉండాలి
ABN, Publish Date - Feb 23 , 2025 | 04:49 AM
సినిమా షూటింగ్ కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు వచ్చిన విజయ్ దేవరకొండను వన్‌టౌన్ సీఐ జీడీబాబు కలిశారు.

సినీ హీరో విజయ్ దేవరకొండ పిలుపు
విశాఖలో పోలీసులతో కలిసి కరపత్రాల విడుదల
విశాఖపట్నం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. సినిమా షూటింగ్ కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు వచ్చిన విజయ్ దేవరకొండను వన్‌టౌన్ సీఐ జీడీబాబు కలిశారు. మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి జీవితాలను బుగ్గిపాల్జేసుకుంటున్నారని, వారిలో చైతన్యం కలిగించేందుకు వీలుగా సందేశం ఇవ్వాలని కోరారు. అందుకు విజయ్ సుముఖత వ్యక్తం చేశారు. ‘మీ కోసం- మీ పోలీస్’ పేరుతో మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు రూపొందించిన కరపత్రాలను శనివారం ఉదయం సీఐతో కలిసి విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.
Updated Date - Feb 23 , 2025 | 04:49 AM