Archbishop Udumula Bala: ఉత్తమ విశాఖ నిర్మాణమే లక్ష్యం
ABN, Publish Date - Apr 04 , 2025 | 07:01 AM
విశాఖపట్నం ఆర్చ్‌బిషప్‌గా ఉడుముల బాల బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వికాసానికి అందరినీ కలిపి కృషి చేయాలన్నది ఆయన లక్ష్యం

బాధ్యతల స్వీకారంలో ఆర్చ్ బిషప్ ఉడుముల బాల
విశాఖపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అందరినీ కలుపుకొని విశాఖపట్నం అభివృద్ధికి తద్వారా ఆంధ్రప్రదేశ్ వికాసానికి కృషి చేయడమే తన లక్ష్యమని విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుముల బాల అన్నారు. జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ మైదానంలో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్చి బిషప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు పోప్ రాయబారి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గెరెల్లి నేతృత్వం వహించారు. విశాఖపట్నం రోమన్ కేథలిక్ అగ్ర పీఠానికి ఉడుమల బాల ఇకపై బాధ్యత వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ.. వరంగల్ తన జన్మభూమి అని, విశాఖపట్నం పుణ్యభూమి అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 07:01 AM