Crime News: బ్యాంకులోకి పెట్రోల్ క్యాన్లతో వచ్చిన వ్యక్తి.. ఏం చేశాడంటే..
ABN, Publish Date - Feb 05 , 2025 | 07:33 AM
అనకాపల్లి జిల్లా: జానకిరామపురం సొసైటీ సీఈవో రామకృష్ణ, గుమస్తా దేవుడు, మరో ఇద్దరు యువకులు మంగళవారం నర్సీపట్నంలోని డీసీసీబీ బ్రాంచ్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా వెనక భాగంలోని ఇనుప గేటుకి చైన్ చుట్టి తాళాలు వేశారు. వెంటతెచ్చిన పెట్రోల్ క్యాన్‌తో రామకృష్ణ నేరుగా మేనేజర్ ఛాంబర్‌లోకి ప్రవేశించాడు.

అనకాపల్లి: నర్సీపట్నం డీసీసీబీ బ్యాంకు (DCCB bank)లోకి ఓ వ్యక్తి పెట్రోల్ క్యాన్లతో (Petrol can) వచ్చి హల్ చల్ (Hul Chal) చేశాడు. మూడు ప్లాస్టిక్ క్యాన్లలో 30 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చాడు. బ్యాంకుతోపాటు, బ్యాంక్ సిబ్బందిపై పెట్రోలు పోసి దాడి చేసేందుకు యత్నించాడు. బ్యాంకు నుంచి సిబ్బంది బయటకు పారిపోకుండా తాళాలు వేశాడు. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది (Bank థtaff).. ఆ వ్యక్తి చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్లను బలవంతంగా లాక్కున్నారు. అప్పటికే ఒక పెట్రోల్ క్యాన్‌లో ఉన్న పది లీటర్ల పెట్రోల్‌ను ఆఫీసులో పోశాడు.
ఈ క్రమంలో బ్యాంక్ సీఈవో వర్మ జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ తీసుకువచ్చిన వ్యక్తి రోలుగుంట మండలం, జానకిరాంపురం సొసైటీ సీఈవో రామకృష్ణగా గుర్తించారు. రైతుల సొమ్ము దుర్వినియోగం చేశాడని ఆరోపణలపై బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. దీనిపై కోపంతోనే అతను పెట్రోల్ దాడికి యత్నించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు రామకృష్ణ తో పాటు వెంట వచ్చిన నలుగురులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే..
జానకిరామపురం సొసైటీ సీఈవో రామకృష్ణ, గుమస్తా దేవుడు, మరో ఇద్దరు యువకులు మంగళవారం నర్సీపట్నంలోని డీసీసీబీ బ్రాంచ్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా వెనక భాగంలోని ఇనుప గేటుకి చైన్ చుట్టి తాళాలు వేశారు. వెంటతెచ్చిన పెట్రోల్ క్యాన్‌తో రామకృష్ణ నేరుగా మేనేజర్ ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది.. అతని చేతిలోని పెట్రోల్ క్యాన్‌ను లాక్కున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానకిరామపురం సొసైటీ సీఈవో రామకృష్ణ పెట్రోల్ పోసి బ్రాంచ్‌కి నిప్పు పెట్టడానికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ గోవిందరావు వచ్చి బ్యాంకులో విచారణ చేశారు. మేనేజర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ఈ సంఘటనపై సీఐ గోవింరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. తనకు జీతం ఇవ్వడంలేదని, ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ క్యాన్‌లతో బ్యాంకుకు వచ్చినట్టు జానకిరామపురం సొసైటీ సీఈవో రామకృష్ణ చెప్పాడన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని అన్నారు.
సీఈవోపై అవినీతి ఆరోపణలు..
జానకిరామపురం పీఏసీఎస్ సీఈవో రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సొంత అవసరాలకు బ్యాంకు డబ్బులు వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పీఏసీఎస్‌లో జరిగిన అవకతవకలపై గత ఏడాది జూలై 22 తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనిపై అధికారులు విచారణ జరిపి అవకతవకలు వాస్తవమేనని తేల్చారు. సీఈవో రామకృష్ణ నుంచి రూ.16 లక్షలు రికవరీ చేసి, అతనిని సస్పెండ్ చేయాలని సబ్ డివిజనల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఐవీ రమణమూర్తి జిల్లా సహకార శాఖ అధికారికి నివేదిక ఇచ్చారు. ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 07:33 AM