Share News

ప్రతి ఇంటికీదోమల మందు పిచికారీ చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:27 AM

పిచికారీ చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కుమ్మరిపుట్టు గ్రామంలో మంగళవారం జెండా ఊపి దోమల మందు స్ర్పేయింగ్‌ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లక్ష్యం మేరకు ప్రతి ఇంటికి లోపల, బయట మందు పిచికారీ చేయాలన్నారు.

ప్రతి ఇంటికీదోమల మందు పిచికారీ చేయాలి
పాడేరు మండలం కుమ్మరిపుట్టు వద్ద జెండా ఊపి స్ర్పేయింగ్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

స్ర్పేయింగ్‌ పనులను ప్రారంభించిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో లక్ష్యం మేరకు ప్రతి ఇంటికీ దోమల నివారణ మందు పిచికారీ చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కుమ్మరిపుట్టు గ్రామంలో మంగళవారం జెండా ఊపి దోమల మందు స్ర్పేయింగ్‌ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లక్ష్యం మేరకు ప్రతి ఇంటికి లోపల, బయట మందు పిచికారీ చేయాలన్నారు. మలేరియా నియంత్రణలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నారు. తొలి రోజు 33 గ్రామాల్లో పిచికారీ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, జిల్లా మలేరియా అధికారి తులసి, వైద్యారోగ్య, మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:27 AM