ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lokesh: వాటిలో ఏపీని నెంబర్ 1గా నిలబెడతాం

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:21 PM

Andhrapradesh: ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్.. భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందని మంత్రి లోకేష్ అన్నారు. టెక్నాలజీ మాత్రమే కాదు విజన్ కూడా ఎంతో ముఖ్యమని... అప్పుడే మనం అనుకునే లక్ష్యాల్ని సాధించగలమని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.

AP Minister Nara lokesh

విశాఖపట్నం, జనవరి 8: ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్‌గా మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. విశాఖ వీఎంఆర్‌డీఏలో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ వన్ స్థానాల్లో నిలబెడతామని చెప్పారు. రాష్ట్రాన్ని డిజిటల్ రెవల్యూషన్‌ వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) ఈరోజు విశాఖకు వస్తున్నారని.. సుమారు 2 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్.. భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదిక కానుందన్నారు. టెక్నాలజీ మాత్రమే కాదు విజన్ కూడా ఎంతో ముఖ్యమని... అప్పుడే మనం అనుకునే లక్ష్యాల్ని సాధించగలమని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐఎఫ్ రాకింగ్‌లో ఏపీ 9వ స్థానంలో ఉందని.. మూడవ స్థానానికి తీసుకువెళ్తామని మంత్రి ధీమాగా చెప్పారు.


చిత్తూరు, తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌గా తయారుస్తున్నామన్నారు. గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమపై ఫోకస్ చేస్తున్నామని.. డ్రోన్ టెక్నాలజీపై దృష్టి పెట్టామన్నారు. విశాఖను ప్రపంచానికి డేటా సిటీగా తయారు చేస్తామని అన్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ స్టార్ట్ అప్ పరిశ్రమల కోసం కేటాయించామన్నారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాము. యువతలో స్కిల్స్‌ను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక సూచనలు


కాగా.. విశాఖలో జనవరి 8, 9 తేదీల్లో ఏపీ డిజిటల్‌ టెక్నాలజీ సదస్సు జరుగనుంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో ఐటీ, ఐటీఈఎస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఎలక్ర్టానిక్స్‌, స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ టెక్నాలజీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీ, క్రియేటివ్‌ టెక్నాలజీలపై చర్చలు జరుగనున్నాయి. ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా సహకారం అందిస్తోంది.


ఇవి కూడా చదవండి...

విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 08 , 2025 | 01:25 PM