వీసీ.. విభిన్నశైలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:31 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తొలిరోజు నుంచి ఆయన సమ యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత పాలకుల మాదిరిగా ఛాంబర్‌లో కూర్చుని గంటల తరబడి వచ్చిన వారితో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.

ఏయూను గాడిన పెట్టడంపై దృష్టి
గత పాలకులకు భిన్నంగా
వ్యవహరిస్తున్న జీపీ రాజశేఖర్
సమయానికి అత్యధిక ప్రాధాన్యం
ఛాంబర్‌లో చిట్‌చాట్‌కు దూరం
ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు
మాత్రమే అవకాశం
హంగూ, ఆర్బాటం లేకుండా విభాగాల్లో
ఆకస్మిక తనిఖీలు
వారంలో రెండు, మూడు తరగతులు బోధిస్తున్నట్టు సమాచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తొలిరోజు నుంచి ఆయన సమ యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత పాలకుల మాదిరిగా ఛాంబర్‌లో కూర్చుని గంటల తరబడి వచ్చిన వారితో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. వైస్ చాన్సలర్‌ను కలవాలంటే బయట వాళ్లైనా, వర్సిటీకి చెందిన అధికారులైనా సరే విషయ మేమిటో ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్య మైన అంశం అయితేనే ఆయన మాట్లా డేందుకు అంగీకరిస్తున్నారు. లేదంటే తరువాత చూద్దా మంటున్నారు. రిజిస్ర్టార్, రెక్టార్ సహా ప్రిన్సిపాల్స్, డీన్లు, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆయన అదే విషయం చెబుతున్నారు. ముఖ్యమైన అంశ మైతేనే తన వద్దకు రావాలని, లేదంటే వద్దని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలకు రావాల్సిన అవసరం లేదని, వాటిని తనకు మరో పద్ధతిలో తెలియజేస్తే సరిపోతుందంటున్నారు. అలాగే, ఛాంబర్‌లోనే కూర్చుని ఉండిపోకుండా ప్రతిరోజూ కొన్ని విభా గాలను సందర్శిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలోని కొన్ని విభాగాలతోపాటు దూరవిద్య, సైన్స్ కాలేజీ పరిధిలోని కొన్ని డిపార్టుమెంట్‌లకు ఆయన వెళ్లినట్టు తెలిసింది. అక్కడ సిబ్బందితో మాట్లాడి ఇబ్బందులు, పనితీరులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల తోనూ ఆయన మమేకమవుతున్నారు. తరగతులు జరుగుతున్న తీరు, బోధనలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. హాస్టళ్లలో భోజనం సరిగా లేదని చెప్పడంతో కొన్నింటిని ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజూ ఒక్కో హాస్టల్ నుంచి భోజనం తెప్పించుకుని తింటున్నారు. కుటుంబ సభ్యులకు కూడా హాస్టల్ నుంచే భోజనం వెళుతోందని చెబుతున్నారు. దీనివల్ల విద్యా ర్థులకు పెట్టే భోజనం నాణ్యత, రుచి వంటివి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నది ఆయన భావన. అలాగే, గడిచిన కొద్దిరోజుల నుంచి సైన్స్ కాలేజీ పరిధిలోని మ్యాథ్స్ డిపార్టు మెంట్‌లో విద్యార్థులకు ఆయన పాఠాలు చెబు తున్నారు. వారంలో రెండు, మూడు క్లాసులు తీసుకుంటున్నట్టు తెలిసింది. కొద్దిరోజుల్లో ఇంజ నీరింగ్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆయన వెళ్లనున్నట్టు చెబుతున్నారు.
దూరంతో మేలు..
విభాగాల వారీగా తనిఖీలు ఉంటాయని, పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని గతం లోనే సూచించారు. దీంతో వీసీ ఎప్పుడు వస్తారో తెలియక అధికారులు విభాగాల్లోనే ఉంటున్నారు. ఆయన వచ్చే సమయానికి లేకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో చాలామంది కనిపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఒక్కరే, అది కూడా సమాచారం లేకుండా వెళుతున్నారు. ఇది వర్సిటీలోని ఫ్యాకల్టీ, సిబ్బంది పనితీరును మెరుగుపర్చేందుకు దోహదం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు.