Tahawwur Rana: తహవ్వుర్ రాణా అప్పగింత ప్రక్రియ మా హయాంలోనే మొదలైంది : చిదంబరం
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:45 PM
అప్పగింత ప్రక్రియను ప్రారంభించినది ప్రధానమంత్రి మోదీ కాదని, యూపీఏ (2004-2014) హయాంలో అనుసరించిన నిలకడైన వ్యూహాత్మక దౌత్యమే ఇప్పుడు ప్రయోజనాలను పొందుతోందని చిదంబరం అన్నారు.

న్యూఢిల్లీ: ముంబై ఉగ్ర దాడుల కీలక నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawur Rana)ను తీసుకురావడం భారత దౌత్యవిధానం సాధించిన విజయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ (Congress) పార్టీ తాజాగా స్పందించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలోనే వ్యూహాత్మక దౌత్య విధానం ప్రారంభించామని, ఇప్పుడు దాని ప్రయోజనాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) అన్నారు. మోదీ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
Tahawwur Rana Extradition: రాణా ఆట కట్టించిన ఐపీఎస్.. కసబ్‌తో తలపడింది కూడా ఈయనే
"2025 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సంయుక్త ప్రకటనలో ఈ క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రెడిట్ అంతా యూపీఏ హయాంలో మేము తీసుకున్న వ్యూహత్మాక దౌత్య విధానాలకే దక్కుతుంది. లష్కరే తొయిబా, ఐఎస్ఐతో రాణా సమన్యయం నెరుపుతున్నట్టు చాలా ఏళ్ల క్రితమే మేము గుర్తించా. ఎట్టకేలకు 2025 ఏ ప్రిల్ 8న రాణాను భారత అధికారులకు యూఎస్ అధికారులు అప్పగించారు. ఏప్రిల్ 10న రాణాను భారత్‌కు తీసుకువచ్చారు" అని చిదంబరం చెప్పారు.
మోదీ చేసింది కాదు..
అప్పగింత ప్రక్రియను ప్రారంభించినది ప్రధానమంత్రి మోదీ కాదని, యూపీఏ (2004-2014) హయాంలో అనుసరించిన నిలకడైన వ్యూహాత్మక దౌత్యమే ఇప్పుడు ప్రయోజనాలను పొందుతోందని అన్నారు. దౌత్యం, చట్ట అమలు సంస్థలప పనితీరు, అంతర్జాతీయ సహకారం, చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం వల్లే ఇది సాధ్యమైందని, ఛాతీ చరుచుకోవడం వల్ల కాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..