Share News

జారి పడిన ఎక్స్‌కవేటర్‌.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:33 AM

ట్రాలీ లారీపై తరలిస్తున్న ఎక్స్‌కవేటర్‌ జారి పడి విద్యుత్‌ స్తం భంపై పడడంతో ఓ గిరిజన గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

జారి పడిన ఎక్స్‌కవేటర్‌.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ట్రాలీ లారీపై తరలిస్తున్న ఎక్స్‌కవేటర్‌ జారి పడి విద్యుత్‌ స్తం భంపై పడడంతో ఓ గిరిజన గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. పట్టుచెన్నారు మార్గంలో ఆదివారం రాత్రి ట్రాలీ లారీపై ఎక్స్‌కవేటర్‌ను తరలిస్తున్నారు. ఘాట్‌ రోడ్డులోని కొండంగివలస సమీపా న గల ఓ మలుపు వద్ద ఎక్స్‌కవేటర్‌ ట్రాలీ నుంచి జారి పడి ఓ విద్యుత్‌ స్తంభంపై పడింది. ఈ ప్రమాదంతో ఎవరికి గాయాలు కాలేదు. ఆ విద్యుత్‌ స్తంభం మాత్రం విరిగిపోయింది. విద్యుత్‌ స్తంభం విరిగిపోవడంతో అడ్డుగుడ అనే గిరిజన గ్రామానికి గత రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరణ కాలేదు. తమకు ప్రత్యామ్నయ మార్గంలో విద్యుత్‌ సరఫరా చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:33 AM