ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

A soldier: ఓ సైనికుడు

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:36 PM

A soldier:దేశ రక్షణ రంగంలో చేరి మాతృభూమి రక్షణకు కృషి చేద్దామనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం. ఆరో తరగతి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన.. ప్రత్యేక శిక్షణతో త్రివిధ దళాల్లో భాగస్వామ్య మయ్యేందుకు చక్కని అవకాశం కల్పిస్తున్నాయి సైనిక పాఠశాలలు.

కోరుకొండ సైనిక స్కూల్‌

  • ఫ ఈ నెల 13 వరకు గడువు

  • ఫ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో అర్హత పరీక్ష

  • ఫ ఎన్‌డీఏ లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ, బోధన

  • ఫ త్రివిధ దళాల్లో చేరేందుకు అవకాశం

విజయనగరం టౌన్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ రంగంలో చేరి మాతృభూమి రక్షణకు కృషి చేద్దామనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం. ఆరో తరగతి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన.. ప్రత్యేక శిక్షణతో త్రివిధ దళాల్లో భాగస్వామ్య మయ్యేందుకు చక్కని అవకాశం కల్పిస్తున్నాయి సైనిక పాఠశాలలు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సైనిక పాఠశా లల్లో ప్రవేశాలకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఎ) ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2025 - 26 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో బాలబాలికలు ప్రవేశాలు పొందడానికి పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి ఫిబ్రవరి 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. అక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది.


మన రాష్ట్రంలో రెండు

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మన రాష్ట్రంలో రెండు ఉన్నాయి. అందులో విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాల ఒకటి కాగా, చిత్తూరు జిల్లా కలికిరిలో మరో సైనిక పాఠశాల ఉంది. ఇవీ..

అర్హతలు ఇవే..

అసైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల వయసు 2025 మార్చి 31 నాటికి 10-12 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివి ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి 13-15 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదివి ఉండాలి.


ఎన్ని మార్కులకు అంటే..

6వ తరగతి వారికి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. లాంగ్వేజీ, ఇంటెలిజెన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌లో 25 ప్రశ్నల చొప్పున ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కులు ఉంటాయి. గణితంలో 50 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. వీరికి అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 9వ తరగతి వారికి 400 మార్కులకు ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహిస్తారు. గణితంలో 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్‌, జనరల్‌ సైన్స్‌, ఆంగ్లం, సోషల్‌ సైన్సు సబ్జెక్ట్‌ల్లో ఒక్కోదానికి 25 ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు ఇవే..

6వ తరగతి విద్యార్థులకు పరీక్షా సమయం 2.30 గంటలు. 9వ తరగతి విద్యార్థులకు 3 గంటలు ఉంటుంది. రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన కేంద్రాల్లో సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

Updated Date - Jan 02 , 2025 | 11:36 PM