Share News

జనసేన నాయకునిపై హత్యాయత్నం

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:12 AM

Assassination attempt on Janasena leader రామభద్రపురం మండల కేంద్రంలో జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి ధనంజయపై ఆదివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి చాలా ఏళ్లు తన ఆధీనంలో ఉంచుకున్నాడు.

జనసేన నాయకునిపై హత్యాయత్నం
గాయపడిన జనసేన నాయకుడిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

జనసేన నాయకునిపై హత్యాయత్నం

కత్తితో దాడి చేసిన వైసీపీ కార్యకర్త

అపస్మారక స్థితిలో బాధితుడు

స్టేషన్‌ వద్ద భారీగా మోహరించిన జనసైనికులు

రామభద్రపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండల కేంద్రంలో జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి ధనంజయపై ఆదివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి చాలా ఏళ్లు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలాన్ని స్థానికుడైన అక్కునాయుడుకు విక్రయించాడు. అక్కునాయుడు తాజాగా పండ్ల దుకాణం పెట్టాడు. ఇప్పటికే ఈ భూమి విషయంలో గొడవ నడుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అయినా కూడా పట్టించుకోకుండా పండ్ల దుకాణం ఏర్పాటు చేయడంపై జనసేన నాయకుడు మహంతి ధనంజయ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. స్టేషన్‌ నుంచి ఇంటికి వెళుతున్న ధనంజయపై ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తలపైన, వీపుపైన తీవ్రంగా గాయపరిచాడు. గాయాలైన ధనంజయను బంధువులు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. తలపై నాలుగు కుట్లు, వీపుపై ఐదు కుట్లు వేసి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం తీసుకెళ్లారు. ధనంజయ్‌పై దాడిచేసిన వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్టు తెలిసింది. సమాచారం అందిన వెంటనే బొబ్బిలి రూరల్‌ సీఐ కె.నారాయణరావు స్టేషన్‌కు చేరుకున్నారు.

- మండల కేంద్రంలో ఉన్న జనసేన నాయకుడు మహంతి ధనంజయపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మడక తిరుపతినాయుడు, సీఐటీయు జిల్లా నాయకుడు పి.శంకరరావులు ఖండించారు. ఇటువంటి భౌతిక దాడులు దారుణమన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 01:12 AM