రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:17 AM
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర
బలిజిపేట, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం ఆయ న గంగాడ గ్రామంలోని దళితవాడను సందర్శించి, ప్రజ ల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని తాగు నీటి సమస్యను అక్కడ మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ చ్చారు. దీంతో ఆయన ఆ శాఖాధికారులతో మాట్లాడి.. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6లక్షలతో దళి తవాడలో ఇంటింటికి కుళాయిలు వేయాలని ఆదేశించారు. అక్కడి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రధాన వీధిలో రూ.50లక్షలతో పక్కా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిం చామని చెప్పారు. గ్రామంలోని ఎస్సీ వీధిలో వంద గృహా లు ఉన్నప్పటికీ నేటి వరకు పైపులు లేకుండా ఎలా నీరు సరఫరా చేశారని అధికారులపై మండిపడ్డారు. సత్వరమే ఆ వీధికి తాగునీటి సదుపాయం కల్పించాలని ఆయన నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్‌కు ఆదేశించారు. గ్రామంలోని సచివాలయ ఉద్యోగులు సక్ర మంగా విధులకు హాజరు కావడంలేదని పలువురు తెలి పారు. దీంతో ఆయన అక్కడే ఉన్న ఎంపీడీవో నగేష్‌తో మాట్లాడి, ఉద్యోగుల పనితీరు బాగోలే కపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఐ కరుణకుమార్, జేఈ పవన్‌కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు పి.వేణుగోపాలనాయుడు, కొప్పలవెలమ రాష్ట్ర డైరక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, బీసీ సెల్ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు బూరాడ రామ్మోహనరావు, నాయకులు గౌరీ శంకరరావు, రాధాకృష్ణ, గౌరునాయుడు పాల్గొన్నారు.
పనిచేయని వారిని పంపించేయండి
వంతరాం సచివాలయ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
బలిజిపేట, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వంతరాం గ్రామ సచివాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయంలో 14 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో ఆయన అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఆయన ఎంపీడీవో నగేష్‌తో ఫోన్‌లో మా ట్లాడి గైర్హాజరైన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారికి మెమోలు ఇవ్వాలన్నారు. ఈ విష యం ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపడతామని ఆయన ఎంపీడీవోకు తెలిపారు. పనిచేయని ఉద్యోగులను ఇక్కడ నుంచి వేరొక చోటుకు పంపించేయాలని ఆదేశిం చారు. ఉద్యోగుల హాజరు పట్టీ అందుబాటులో లేదని, ఉద్యోగుల వారం రోజుల హాజరు వివరా లను తనకు సాయంత్రంలోగా తెలియజేయాలని ఆయన ఎంపీడీవోకు ఆదేశించారు.