Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు: విప్‌

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:03 AM

ప్రజల నుంచి వినతిపత్రాల రూపంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. సోమవారం గుమ్మల క్ష్మీపురంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

 సమస్యల పరిష్కారానికి చర్యలు: విప్‌
గుమ్మలక్ష్మీపురం: వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వినతిపత్రాల రూపంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. సోమవారం గుమ్మల క్ష్మీపురంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఆయా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు.

వయోజన విద్యాకేంద్రాలు వినియోగించుకోండి

కురుపాం రూరల్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి):వయోజన విద్యా కేంద్రాలను వినియోగించుకుని గిరిజనులు అక్షరాస్యతను పెంపొందించుకోవాలని కురు పాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం మొండెంఖల్‌ పంచాయతీ పరిధిలోని కొత్తూరులో వయోజన విద్యా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోలా రంజిత్‌కుమార్‌, కలిశెట్టి కొండయ్య, కె. కళావతి పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:03 AM