Sankranthi: సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధం
ABN, Publish Date - Jan 13 , 2025 | 10:13 AM
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జోరుగా కోడిపందేలు, జూదాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు అందుకనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా: సంక్రాంతి (Sankranti ) కోడి పందాలకు (Cockfight) నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari Dist.) వ్యాప్తంగా భారీగా బరులు రెడీ అయ్యాయి. పందాల నిర్వాహకులు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల తరువాత పందాల మొదలయ్యే అవకాశం ఉందంటుని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా పందాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జోరుగా కోడిపందేలు, జూదాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు అందుకనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలవ్యాప్తంగా కోడిపందాల నిర్వాహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కొబ్బరితోటలు, ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ ట్రాక్టర్లుతో చదును పనులు చేయిస్తున్నారు. మరోపక్క కోడిపందాలతో పాటు వాటి చెంతనే గుండాటలు ఆడుకునేందుకు రూ.లక్షల్లో అంతర్గత ఒప్పందాలు జరిగిపోతున్నాయని చెబుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
సూర్యాపేట: సైకో భర్తను హతమార్చిన భార్యలు
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోడి పందాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. గతం కంటే భిన్నంగా జిల్లా వ్యాప్తంగా భారీగా పందెం బరుల ఏర్పాటుకు కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఎవరికి తగిన తీరిలో వారు బరుల ఏర్పాటులో రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బరులు నిర్వహిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల, కాట్రేనికోన మండలం చెయ్యేరు, ముమ్మిడివరం మండలం కొత్తలంకలతో పాటు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, అమలాపురం మండలంలోని అనేక ప్రాంతాలతో పాటు రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలో భారీగా పందెం బరులు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని బరులు ఏర్పాటవుతున్నాయి. మరోవైపు సంక్రాంతి సంబరాల పేరిట సెట్టింగులు వేసి ఆ ముసుగులోనే గుండాట, పేకాట, కోడి పందాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడక్కడా తమ ఉనికిని చాటుకునేందుకు ఫ్లెక్సీలు పెట్టి ఫొటోలు తీయడం ‘షరా మామూళ్ల’గానే మారింది. మరికొన్ని చోట్ల పోలీసు బందోబస్తు నడుమ బరులను ట్రాక్టర్లతో దున్నేస్తున్నట్టు చేస్తున్నప్పటికీ అవి మొక్కుబడిగానే జరుగుతున్నాయి. బరి ఒకచోట ఉంటే మరోచోట ట్రాక్టర్‌తో దున్నే పనులు చేయడం కనిపిస్తోంది.
ఈ సారి మురమళ్లలో భారీ ఏర్పాట్ల నడుమ కోడిపందాలు నిర్వహించడానికి వీఐపీ బరిని సిద్ధం చేస్తున్నారు. కోడిపందాల బరుల వద్ద కొన్నిచోట్ల ఇప్పటికే బెల్టుషాపులు పబ్లిక్‌గా వెలిశాయి. నిబంధనకు విరుద్ధంగా బహిరంగ లిక్కర్ విక్రయాలు పందెం బరుల వద్ద చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే బరులు ఏర్పాటయ్యే విధంగా కూటమి నాయకులు, పోలీసులతో మంతనాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులకు ఇష్టం లేకుండా బరులు వేస్తుంటే వాటిని పోలీసులు అడ్డుకునే విధంగా వ్యూహాలు రూపొందించారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వందకుపైగా కీలక బరులు సోమవారం నుంచి ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. అయితే ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోడిపందాల బరులు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చినప్పటికీ అవి ఈ పండుగ సీజన్లో ఖచ్చితంగా అమలయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం కూడా చేతులెత్తేయడంతో పబ్లిక్‌గా బరులు ప్రధాన రహదారుల చెంతనే ఏర్పాటవుతున్నాయి. వీటిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు సైతం ముందుకు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..
కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 13 , 2025 | 11:19 AM