Share News

పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:36 AM

దెందులూరు మండల పరిధిలో కొమిరేపల్లి అడ్డ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు వేగంగా ఢీకొంది.

పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
సంఘటనాస్థలిలో అప్పారావు మృతదేహం

మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న కారు

వరుడి తండ్రి, బంధువు మృతి

కొమిరేపల్లి వద్ద ప్రమాదం

నిడమర్రులో పెళ్లింట విషాదం

దెందులూరు/నిడమర్రు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంటికి పచ్చ తోరణాలు కడుతున్నారు.. పందిరి వేస్తున్నారు.. మరో వైపు పెళ్లి కార్డులు పంచడానికి హడావుడి. కొద్ది రోజుల్లో పెళ్లి బాజా మోగనుంది. అంతలోనే ఇంటి పెద్ద ను మృత్యువు కబళించడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. నిడమర్రు గ్రామానికి చెందిన పతివాడ బాపన్న పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. దగ్గరి బంధువులకు పెండ్లి కార్డు ఇవ్వడానికి బంధువు గరిమెళ్ల అప్పారావుతో కలి సి బాపన్న మోటార్‌సైకిల్‌పై బయలు దేరాడు. శుభలేఖలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృత్యుఒడికి చేరారు.

దెందులూరు మండల పరిధిలో కొమిరేపల్లి అడ్డ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గరిమెళ్ల అప్పారావు (50) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వరుడి తండ్రి పతివాడ బాపన్న (55)ను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందారు. ఏలూరు, దెందులూరులో బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరిగి నిడమర్రు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు.

బాపన్నకు ఇద్దరు కుమారులు కాగా వారం రోజుల్లో పెద్ద కుమారుడి వివాహం జరగనుం డగా ప్రమాదంతో విషాదం నిపింది. బాపన్నతో పాటు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన బంధువు అప్పారావు కూడా మృత్యువాత పడడంతో పెళ్లి ఇల్లు శోకసంద్రమైంది.

Updated Date - Apr 11 , 2025 | 12:36 AM