Karri Srinivasa Rao: అయ్యన్నను చంపేస్తానన్నవైసీపీ నేత కర్రి శ్రీను అరెస్టు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:01 AM
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావును జలదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందినప్పటికీ, మరో కేసులో నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు.

నంద్యాల జిల్లాలో కేసు నమోదు
నర్సీపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘‘అయ్యన్నను చంపేస్తా’’ అంటూ అసెంబ్లీ స్పీకర్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేసి.. బెదిరింపులకు దిగిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వైసీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావును నంద్యాల జిల్లా జలదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో శారదా నగర్‌లోని శ్రీ శ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఉన్న కర్రి శ్రీను వద్దకు పట్టణ సీఐ గోవిందరావు, ఎస్‌ఐ రమేశ్, జలదుర్గం పోలీసులు వెళ్లారు. ఆయన్ను జీపులో ఎక్కించుకుని తమ వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కర్రి శ్రీను పోలీసులతో వాగ్వాదానికి దిగి.. నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. శారదానగర్‌లో కర్రి శ్రీను సోదరుడు సత్తిబాబుకు చెందిన శ్రీశ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రభు త్వ భూమి ఆక్రమించి కట్టారని పేర్కొంటూ ఫిబ్రవరి 24 న రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా కర్రి శ్రీనివాసరావు.. అసెంబ్లీ స్పీకర్, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెడతారు. నన్ను చంపేయమనం డి. లేదంటే నేనే ఆయన్ని చంపేస్తా’’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధుబాబు నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీను హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు.. నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన టీడీపీ నేత దూదీకుల హుస్సేన్ మార్చి 6న అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేయడం, బెదిరించడంతో మనస్తాపం చెందానని పేర్కొన్నారు. దీంతో జలదుర్గం పోలీసులు శ్రీనుపై కేసు నమోదు చేసి, బుధవారం అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..