Share News

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:35 PM

దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అయితే వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగుల జీతాలు ఏ మేరకు పెరుగుతాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
8th Pay Commission Salaries

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 జనవరిలో 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ వేతన సంఘం ప్రకారం 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రభుత్వ (కేంద్ర) విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలలో (Salaries) భారీ పెరుగుదల ఉండనుంది. ఈ క్రమంలో 8వ వేతన సంఘం ప్రకారం అన్ని ఉద్యోగుల జీతం 2.86 ఫిట్‌మెంట్ ఆధారంగా పెరగనుంది. ఈ మేరకు 8వ వేతన సంఘం అమలు తర్వాత, ప్యూన్ నుంచి సివిల్ సర్వీస్ ఆఫీసర్ వరకు ఉన్న ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయో ఇక్కడ చూద్దాం.


1. స్థాయి 1

ఈ స్థాయిలో ప్యూన్లు, సహాయక సిబ్బంది వంటి ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుతం ఈ ఉద్యోగుల ప్రస్తుత మూల జీతం రూ. 18,000. 2.86 ఫిట్‌మెంట్ ప్రకారం, వారి జీతం పెరిగి రూ. 51,480కి చేరుకుంటుంది. అంటే రూ. 33,480 పెరుగుదల ఉంటుంది.

2. స్థాయి 2

ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్కులు ఉంటారు. వీరి ప్రస్తుత మూల జీతం రూ. 19,900. 8వ వేతన సంఘం అమలు తర్వాత, వీరి జీతం రూ. 37,014 పెరిగి, రూ. 56,914కి చేరుకుంటుంది.


3. స్థాయి 3

ఈ స్థాయిలో ఉద్యోగులు పోలీసు కానిస్టేబుళ్లు, నైపుణ్య సిబ్బంది ఉంటారు. వీరి ప్రస్తుత మూల వేతనం రూ. 21,700. 8వ వేతన సంఘం అమలుతో వీరి జీతం రూ. 40,362 పెరిగి రూ. 62,062 అవుతుంది.

4. స్థాయి 4

ఈ స్థాయిలో పోలీస్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్కులు ఉంటారు. వారి ప్రస్తుత మూల జీతం రూ. 25,500. 8వ వేతన సంఘం అమలు తర్వాత, వారి జీతం రూ. 47,430 పెరిగి రూ. 72,930కి చేరుకుంటుంది.

5. స్థాయి 5

ఇందులో సీనియర్ క్లర్కులు, ఉన్నత స్థాయి సాంకేతిక అధికారులు ఉంటారు. వీరి ప్రస్తుత మూల జీతం రూ. 29,200. 8వ వేతన సంఘం అమలు తర్వాత, వారి జీతం రూ. 54,312 పెరిగి రూ. 83,512కి చేరుతుంది.


6. స్థాయి 6

ఈ స్థాయిలో ఉద్యోగులు ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు కలరు. వారి ప్రస్తుత మూల జీతం రూ. 35,400 కాగా, 8వ వేతన సంఘం అమలుతో వీరి జీతం రూ. 65,844 పెరిగి రూ. 1,01,244 అవుతుంది.

7. స్థాయి 7

ఈ స్థాయిలో సూపరింటెండెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు. వీరి ప్రస్తుత మూల జీతం రూ. 44,900 కాగా, 8వ వేతన సంఘం అమలు తర్వాత, వారి జీతం రూ. 83,514 పెరిగి రూ. 1,28,414కి చేరుకుంటుంది.


8. స్థాయి 8

ఈ స్థాయిలో సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఉంటారు. వీరి ప్రస్తుత మూల జీతం రూ. 47,600 కాగా, 8వ వేతన సంఘం అమలుతో వీరి జీతం రూ. 88,536 పెరిగి రూ. 1,36,136కి చేరుతుంది.

9. స్థాయి 9

ఈ స్థాయిలో డిప్యూటీ సూపరింటెండెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు. వారి ప్రస్తుత మూల జీతం రూ. 53,100. 8వ వేతన సంఘం అమలు తర్వాత, జీతం రూ. 98,766 పెరిగి రూ. 1,51,866 అవుతుంది.

10. స్థాయి 10

ఈ స్థాయిలో సివిల్ సర్వీస్ అధికారులు, గ్రూప్ ఏ అధికారులు ఉంటారు. వారి ప్రస్తుత మూల జీతం రూ. 56,100. 8వ వేతన సంఘం అమలుతో వీరి జీతం రూ. 1,04,346 పెరిగి రూ. 1,60,446కి చేరుకుంటుంది.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 04 , 2025 | 03:36 PM