Share News

10 నిమిషాల్లో ఇంటికి సిమ్‌ కార్డు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:36 AM

భారతి ఎయిర్‌టెల్‌ మరో వినూత్న సర్వీసుకు శ్రీకారం చుట్టింది. కస్టమర్లు కోరిన 10 నిమిషాల్లో వారి ఇంటికి సిమ్‌ కార్డు పంపిస్తామని ప్రకటించింది...

10 నిమిషాల్లో ఇంటికి సిమ్‌ కార్డు

బ్లింకిట్‌తో ఎయిర్‌టెల్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారతి ఎయిర్‌టెల్‌ మరో వినూత్న సర్వీసుకు శ్రీకారం చుట్టింది. కస్టమర్లు కోరిన 10 నిమిషాల్లో వారి ఇంటికి సిమ్‌ కార్డు పంపిస్తామని ప్రకటించింది. ఇందుకోసం క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘బ్లింకిట్‌’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవ కోసం ఖాతాదారులు రూ.49 చెల్లించాలి. ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, హైదరాబాద్‌ వంటి 16 నగరాల్లో ఈ సర్వీసు లభిస్తుంది. త్వరలోనే మిగతా నగరాలు, పట్టణాలకూ ఈ సేవను విస్తరించబోతున్నట్టు తెలిపింది. ఈ పద్దతిలో సిమ్‌ కార్డు అందుకున్న ఖాతాదారులు 15 రోజుల్లోగా తమ ఆధార్‌ సాయంతో తమ కనెక్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:36 AM