Share News

Amazon Jobs: అమెజాన్ సంచలన నిర్ణయం.. వారందరి ఉద్యోగాలు ఊస్ట్..

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:22 PM

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సారి ఉద్యోగులకు షాక్ ఇచ్చే పనికి శ్రీకారం చుట్టింది. త్వరలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు తీసేయాలని భావిస్తోంది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Amazon Jobs: అమెజాన్ సంచలన నిర్ణయం.. వారందరి ఉద్యోగాలు ఊస్ట్..
Amazon News

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా మెగా కాస్ట్ సేవింగ్ డ్రైవ్ మొదలుపెట్టింది. పెద్ద మొత్తంలో ఉద్యోగాలు తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని నెలల్లో 14 వేల మేనేజర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపాలని చూస్తోంది. ఇలా చేయటం ద్వారా సంవత్సరానికి 210 నుంచి 360 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనరల్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ పదవుల్లో ఏకంగా 1,05,770 మంది ఉన్నారు. కోతల తర్వాత ఆ సంఖ్య 91,936కు పడిపోతుంది.


గత జనవరిలోనూ కోతలు..

అమెజాన్ సంస్థ ఎక్కడికక్కడ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తరచుగా ఉద్యోగులను తీసేస్తోంది. గత జనవరి నెలలో కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న డజన్ల కొద్ది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. అంతేకాదు.. అమెజాన్ నార్త్ అమెరికా స్టోర్స్ విభాగంలోని మరికొంతమంది ఉద్యోగాలను కూడా తీసేసింది. ఒక్క 2023 సంవత్సరంలోనే అమెజాన్ కొన్ని వేల మందిని ఉద్యోగాలనుంచి తీసేసింది. ఆ సంవత్సరం అమెజాన్‌లో పని చేస్తున్న 27 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం రెండు రౌండ్లలోనే వీరందరి ఉద్యోగాలు పోయాయి. 2024 సంవత్సరంలోనూ అమెజాన్ వందలాది మంది ఉద్యోగులను పని నుంచి తీసేసింది.


వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ముగింపు..

అమెజాన్ సీఈఓగా యాండీ జెస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడ్డవారికి యాండీ తీసుకునే నిర్ణయాలు తలనొప్పిగా మారాయి. యాండీ 2024లో వర్క్ ఫ్రమ్ హోమ్ మీద కూడా కీలక నిర్ణయం తీసుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు వారంలో 5 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించాడు. అలా కుదరకపోతే వేరే జాబ్ చూసుకోమని అన్నాడు. కేవలం అమెజాన్ మాత్రమే కాదు.. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా కోతలు చేపట్టాయి. మోర్గాన్ స్టేన్‌లే, గోల్డ్‌మ్యాన్ సాచ్, ఇంటెల్ కంపెనీలు ఈ సంవత్సరం కూడా ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు పోనున్నాయి.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 19 , 2025 | 05:42 PM