Share News

Indian Stock Market: ఐటీ షేర్లకు దూరంగా ఉండటం బెటర్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:07 AM

ఈ వారం మార్కెట్‌ మిశ్రమంగా కదలనున్నా, ఐటీ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని సూచన. ట్రంప్‌ సుంకాల వాయిదా, జియోపాలిటికల్‌ పరిణామాల ప్రభావంతో కొన్ని రంగాల షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉంది

Indian Stock Market:  ఐటీ షేర్లకు దూరంగా ఉండటం బెటర్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలను 90 రోజులకు వాయిదా వేయటంతో ఆర్థిక మాంద్య భయాలను పోగొట్టింది. అయితే చైనాపై సరఫరాలు ఆధారపడటం గమనించదగిన అంశం. ఈ వాణిజ్య యుద్ధంతో భారత్‌కు మేలు జరిగే అవకాశం ఉండటంతో కొన్ని రంగాల షేర్లలో మూమెంటమ్‌ పెరగొచ్చు. ట్రంప్‌ వ్యాఖ్యలు, జియో పొలిటికల్‌ సమీకరణాలను బట్టే మార్కెట్‌ గమనం ఉంటుంది. గతవారం కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎ్‌సయూ, చమురు కంపెనీల షేర్లు పెరిగాయి. ఈ వారం ఐటీ షేర్లకు దూరంగా ఉండటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

పవర్‌గ్రిడ్‌: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు ప్రస్తుతం మూమెంటమ్‌ అందుకుంది. కీలకమైన రూ.250 స్థాయిలో మద్దతు తీసుకుని టర్న్‌ అరౌండ్‌ అయ్యాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.304 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.300 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.322/330 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.292 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్గా పెట్టుకోవాలి.

గుజరాత్‌ గ్యాస్‌ లిమిటెడ్‌: గత ఏడాది ఆరంభం నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బేస్‌ ఏర్పడుతోంది. రూ.380 స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.428 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.410/420 శ్రేణిలో ప్రవేశించి రూ.490 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.400 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా‌స్‌‌గా‌ పెట్టుకోవాలి.


పతంజలి ఫుడ్స్‌: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు మెరుగ్గా రాణిస్తోంది. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగున్నాయి. కొన్ని నెలలుగా రూ.1,800 స్థాయిలో డార్వాస్‌ బాక్స్‌ ప్యాటర్న్‌లో చలిస్తోంది. గత శుక్రవారం రూ.1,886 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,850 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,150 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,810 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

లారస్‌ ల్యాబ్స్‌: కొన్ని నెలలుగా ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం గరిష్ఠ స్థాయి వద్ద రేంజ్‌బౌండ్‌లో కదలాడుతోంది. షార్ట్‌టర్మ్‌ మూమెంటమ్‌ బాగుంది. సగటు వాల్యూమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.605 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.600 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.655 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.585 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

జిందాల్‌ స్టెయిన్‌లెస్ స్టీల్‌: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. వాల్యూమ్‌ తక్కువగా నమోదవుతుండటాన్ని బట్టి చూస్తే పతనం ఆగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.542 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.530/540 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.610 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.520 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్గా‌‌‌ పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

Updated Date - Apr 15 , 2025 | 03:07 AM