Share News

Bank Holidays: ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులో తెలుసా..

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:26 PM

మీకు వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉందా. అయితే ముందుగా ఈ సెలవుల రోజులను చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఏకంగా బ్యాంకులకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Bank Holidays: ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులో తెలుసా..
bank holidays april 2025

ఇంకొన్ని రోజుల్లో మార్చి నెల ముగియనుంది. తర్వాత ఏప్రిల్ మాసం రానుంది. అయితే ప్రతి నెలలో కూడా కొన్ని ముఖ్యమైన సెలవులతోపాటు రాష్ట్రాల ఆధారంగా హాలిడేలు కూడా మారుతుంటాయి. ఈ క్రమంలో మీకు బ్యాంకు సంబంధిత పని ఏదైనా ఉంటే ఈ సెలవుల ఆధారంగా మీ పనులను ప్లాన్ చేసుకోండి. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఏప్రిల్ 2025 బ్యాంక్ సెలవుల జాబితా

  • 01 ఏప్రిల్ 2025, మంగళవారం - వార్షిక ఖాతా ముగింపు కారణంగా మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • 05 ఏప్రిల్ 2025, శనివారం - బాబు జగ్ జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు హాలిడే

  • 06 ఏప్రిల్ 2025, ఆదివారం - వారాంతపు సెలవు

  • 10 ఏప్రిల్ 2025, గురువారం- మహావీర్ జయంతి నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లో హాలిడే

  • 12 ఏప్రిల్ 2025, శనివారం - రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు


  • 13 ఏప్రిల్ 2025, ఆదివారం - వారాంతపు సెలవు

  • 14 ఏప్రిల్ 2025, సోమవారం- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, అసోం ప్రాంతాల్లో సెలవు

  • 15 ఏప్రిల్ 2025, మంగళవారం- బెంగాలీ డే సందర్భంగా కోల్‌కతా, అగర్తలా, గౌహతి, ఇటానగర్, సిమ్లా ప్రాంతాల్లో హాలిడే

  • 16 ఏప్రిల్ 2025, బుధవారం- బోహాగ్ బిహు నేపథ్యంలో గౌహతిలో బ్యాంకులు బంద్

  • 18 ఏప్రిల్ 2025, శుక్రవారం - గుడ్ ఫ్రైడే రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సెలవు


  • 20 ఏప్రిల్ 2025, ఆదివారం- వారాంతపు హాలిడే

  • 21 ఏప్రిల్ 2025, సోమవారం - గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు హాలిడే

  • 26 ఏప్రిల్ 2025, శనివారం - నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు

  • 27 ఏప్రిల్ 2025, ఆదివారం- వారాంతపు సెలవు

  • 29 ఏప్రిల్ 2025, మంగళవారం- మహర్షి పరశురామ జయంతి నేపథ్యంలో సిమ్లాలో సెలవు

  • 30 ఏప్రిల్ 2025, బుధవారం - బసవ జయంతికి కర్ణాటకలో బ్యాంకులు బంద్


సగం రోజుల కంటే

ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో దాదాపు 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే బ్యాంకులు పనిచేసేది మాత్రం నెలలో సగం రోజుల కంటే తక్కువగా ఉంటాయి. కానీ UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు మాత్రం బ్యాంక్ సెలవుల వల్ల ఏమాత్రం ప్రభావితం కావు.


ఇవి కూడా చదవండి:

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 22 , 2025 | 05:43 PM