ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌‌పై మండి పడ్డ స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా..

ABN, Publish Date - Jan 09 , 2025 | 09:12 PM

ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ వారానికి 90 గంటలు పని చేయాలని సూచించడంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఆయన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.

DeepikaPadukone react L&TChairman

ఇటీవల ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి (narayana murthy) వారానికి 70 గంటలు పని చేయాలని సూచించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దేశ విదేశాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పెద్ద కంపెనీ ఛైర్మన్‌ కూడా అలాగే చెప్పడంతో ఇప్పుడు మళ్లీ దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే ఎల్ అండ్ టీ కంపెనీ ఛైర్మన్ (L&TChairma) తన ఉద్యోగులతో మాట్లాడుతూ వారానికి 90 గంటలు పని చేయాలని సూచించారు. 'ఎంతసేపు ఇంట్లోనే ఉండి భార్యవైపు చూస్తారు? వారానికి 90 గంటలు పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.


దీపికా ఏమన్నారంటే..

ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (DeepikaPadukone) స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కథనాన్ని పంచుకున్నారు. ఇంత సీనియర్ పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీపిక తన పోస్ట్‌లో #metalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించారు. అంటే ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా దీపిక మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పదలుచుకున్నారనిపిస్తుంది.


ఆదివారం కూడా పనిచేయాలని...

దీపికా పదుకొణె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ జర్నలిస్ట్ ఫాయే డిసౌజాది. తన ఉద్యోగులను ఆదివారాలు కూడా విధుల్లోకి చేర్చుకోలేకపోతున్నానని ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌ (Subramanian) ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు, నేనే ఆదివారం పని చేస్తున్నందున ఆదివారం మిమ్మల్ని పని చేయించలేకపోతున్నానని చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో మీరు ఇంట్లో కూర్చుని ఏమి చేస్తారు? ఎంతసేపు మీ భార్యను చూస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఓ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.


మరికొంత మంది కామెంట్లు

మరోవైపు ఆయనది బిలియన్ డాలర్ల కంపెనీ అయినప్పటికీ ఇంకా పనిచేయాలని కోరుతున్నారని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. రెస్ట్ లేకుండా పనిచేస్తే ఉద్యోగుల ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు కనీసం సెలవు లేకుండా పనిచేయడం ఎలా కుదురుతుందని ఇంకొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం, కుటుంబ సమయం ఉండదా అని ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉద్యోగులకు కనీసం సెలవులు ఇవ్వకపోతే, వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోయి పనితీరు కూడా ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎల్ అండ్ టి ఛైర్మన్ సుబ్రమణియన్ వ్యాఖ్యలు సర్వత్రా వివాదాస్పదంగా మారాయి.


ఇవి కూడా చదవండి:


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 09 , 2025 | 09:34 PM