ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Musk-Tiktok: టిక్‌టాక్‌ను ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లనుందా?

ABN, Publish Date - Jan 14 , 2025 | 06:36 PM

జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్‌ మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: టిక్‌టాక్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఈ యాప్‌ను మస్క్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. అమెరికన్ యూజర్ల సమాచారం చైనా పరమయ్యే ప్రమాదాన్ని నివారించేందుకు గత ఏడాది బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టెక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీకి అప్పగించే విధంగా ఇందుకు బైట్ డ్యాన్స్ తిరస్కరిస్తే యాప్‌పై నిషేధం విధించేలా అప్పటి ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది.

ఈ చట్టాన్ని సవాలు చేస్తూ టిక్‌టాక్ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జనవరి 19న ఈ అంశంపై తుదీ తీర్పు వెలువడనుంది. కాగా, జనవరి 10న సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు.. నిషేధం తప్పకపోవచ్చనే సంకేతాలనిచ్చాయి. మరోవైపు, టెక్‌టాక్‌ యాజమాన్యం దాని మాతృసంస్థ బైట్‌డ్యా్న్స్ చేతుల్లోనే ఉండాలని పట్టుబడుతున్న చైనా ప్రభుత్వం తను ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.


Elon Musk : అతడి మాటలు పట్టించుకోవద్దు.. బయటకు పొమ్మనండి.. ఎలాన్ మస్క్ తండ్రి

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, టిక్‌టాక్‌పై నిషేధం విధించాల్సి వస్తే ముందుగా దాని పగ్గాలను మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందట. ఈ విషయమై ఇప్పటికే చైనా అధికారులు ట్రంప్ యంత్రాంగంతో చర్చలు కూడా ప్రారంభించారట. ఇందులో భాగంగానే మస్క్ పేరు తెరపైకి వచ్చింది.

Elon Musk: సుచిర్‌ మరణం.. ఆత్మహత్యలా లేదు: మస్క్‌


ఇదిలా ఉంటే, టిక్‌టాక్ మస్క చేతుల్లోకి వెళ్లొ్చ్చన్న వార్తలను సదరు సంస్థ కొట్టిపారేసింది. అన్నీ అభూత కల్పనని తేల్చి చెప్పింది. ఇలాంటి వాటిపై తాము స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇక ఈ విషయంలో మస్క్, టిక్‌టాక్, బైట్ డ్యాన్స్ మధ్య చర్చలు జరిగాయా లేదా అన్నది కూడా తెలియరాలేదు.

కాగా, మస్క్ గతంలోనే టిక్‌టాక్‌పై నిషేధాన్ని వ్యతిరేకించారు. యాప్‌ను చేజిక్కించుకునే అంశంపై నేరుగా స్పందించకపోయినా కూడా ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా ఉద్దేశంలో టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించకూడదు. నిషేధం ద్వారా ఎక్స్ లాభపడినా ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం’’ అని అన్నారు.

Read Latest and International News

Updated Date - Jan 14 , 2025 | 06:36 PM