Share News

FD rate cuts: ఫిక్స్‌డ్ డిపాజిట్‌దార్లకు బ్యాడ్ న్యూస్

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:34 PM

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపేణా డబ్బు పొదుపు చేసిన వారికి బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి దేశ వాణిజ్య బ్యాంకులు. ఇప్పటికే సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చేశాయి.

FD rate cuts: ఫిక్స్‌డ్ డిపాజిట్‌దార్లకు బ్యాడ్ న్యూస్
Banks

FD rate cuts: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని ఇప్పుడు బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు సదరు వడ్డీ రేట్లను సవరించాయి. సవరించిన రేట్లు అమల్లోకి వచ్చేశాయి కూడా. ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) తగ్గించిన వడ్డీ రేట్లను ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి తీసుకురాగా, ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) అమృత్‌ కలశ్‌ పేరిట అందిస్తున్న స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను మార్చి 31తో నిలిపివేసి చేతులు దులుపుకుంది. 2023 ఏప్రిల్‌ నుంచి 400 రోజుల కాలపరిమితితో ఈ డిపాజిట్‌ స్కీమ్‌ను ఎస్బీఐ అందించేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం 2025 ఏప్రిల్ 7-9 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెపో రేటు మరికొంత తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో, మూడు ప్రముఖ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, యెస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FDs) వడ్డీ రేట్లను తగ్గించాయి. ఏప్రిల్ 3, 2025 నాటికి, ఈ బ్యాంకులు కొన్ని నిర్దిష్ట గడువులపై వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు (1 బేసిస్ పాయింట్ = 0.01 శాతం) తగ్గించినట్లు ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు ఎంపిక చేసిన కాలవ్యవధుల డపాజిట్లపై ఎఫ్‌డీ రేట్లను తగ్గించింది. 35 నెలల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీపై 35 బేసిస్‌ పాయింట్లు, 55 నెలల ఎఫ్‌డీపై 40 బేసిస్‌ పాయింట్లు మేర కోత పెట్టింది. ఇకపై ఈ రెండు కాల వ్యవధులపై రూ.3 కోట్ల లోపు రిటైల్‌ డిపాజిట్లపై గరిష్ఠంగా 7 శాతం మాత్రమే వడ్డీ లభించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు అదనం. 21 నెలల కాలవ్యవధిపై మాత్రం అత్యధికంగా 7.25 శాతం వడ్డీని అందిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయకుమార్ సంచలన వ్యాఖ్యలు..

Electric Shockతో ఇద్దరు ఉద్యోగులు మృతి..

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:02 PM