Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN, Publish Date - Apr 04 , 2025 | 07:27 AM
శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బిజినెస్ న్యూస్: అంతర్జాతీయంగా బంగారం ధరలు (Gold Rate) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్నా, కొనుగోలు దారులకు (Buyers) మాత్రం భారంగా మారింది. ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి (Silver) ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గోల్డ్ గ్రాముకు ఒక రూపాయి పెరిగింది. అలాగే వెండి కేజికి రూ. 200 తగ్గింది. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది.
Also Read..: నితీష్ కుమార్‌కు బిగ్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాట పట్టారు. అన్ని దేశాలకు సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకనుందనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 85 వేలు దాటిపోయింది. ఇక ఆ ధర రూ. లక్షకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చెబుతున్నారు. భారత్ సహా ప్రపంచంలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశానంటుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఒక రూపాయి పెరిగి 1 గ్రాము రూ. 8,561 కాగా 10 గ్రాముల ధర రూ. 85,610గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు గ్రాముకు ఒక రూపాయి పెరిగి. ఒక గ్రాము రూ. 9,339 కాగా 10 గ్రాముల ధర రూ. 93,390గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ. 85,610, రూ.93,390
చెన్నై- రూ. 85,610, రూ.93,390
బెంగళూరు- రూ. 85,610, రూ.93,390
పుణె- రూ. 85,610, రూ.93,390
అహ్మదాబాద్- రూ. 85,660, రూ.93,440
భోపాల్- రూ. 85,660, రూ.93,440
కోయంబత్తూర్- రూ. 85,610, రూ.93,390
పట్నా- రూ. 85,660, రూ.93,440
సూరత్- రూ. 85,660, రూ.93,440
పుదుచ్చెరి- రూ. 85,610, రూ.93,390
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 200 తగ్గి... రూ. 1,11,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ.1,02,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.1,02,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,11,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,11,900 వద్ద కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు
మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్ జైలుకే
For More AP News and Telugu News
Updated Date - Apr 04 , 2025 | 07:27 AM