Gold and Silver prices Today: నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 07:13 AM
నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

బిజినెస్ డెస్క్: గతం కొంత కాలంగా క్రమేపీ పెరుగుతున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. నేడు (21-02-2025) ఉదయం 6.30కు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర నిన్నటి రేట్లతో పోలిస్తే రూ.10 మేర పెరిగి రూ.88,200కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,860 వద్ద తచ్చాడుతోంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు మొగ్గు చూపడంతో ధరలకు రెక్కలొచ్చాయి. గతంలోలా భారీ స్థాయిలో మార్పులు లేకపోయినా క్రమంగా రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక వెండి ధరలో మాత్రం నిన్నటితో పోలిస్తే తగ్గుదల కనిపించింది. నిన్న కేజీ వెండి ధర రూ.1,00,500 కాగా నేడు అది రూ.100 తగ్గి రూ. 1,00,500కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గడం గమనార్హం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (22, 24 క్యారెట్లు) ఇవీ
చెన్నై: రూ.80710, రూ.88050
ముంబై: రూ.80710, రూ.88050
ఢిల్లీ: రూ. 80860, రూ.88200
కోల్‌కతా: రూ. 80710, రూ.88050
హైదరాబాద్: రూ. 80710, రూ. 88050