Share News

Gold Rates Today: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పసడి ధరలు..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:06 PM

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ రోజు (ఏప్రిల్ 11) బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Rates Today: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పసడి ధరలు..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయంటే..
Gold Prices Hit All Time High on

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 11న) కూడా పుంజుకున్నాయి. పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతల మధ్య కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ 5న జరిగిన బంగారం ఇండెక్స్ ఈరోజు 10 గ్రాములకు రూ.92,463 వద్ద ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు రూ.92,033 నుంచి రూ.430 పెరిగింది. చివరికి ఇది 977 లేదా 1.06 శాతం లాభంతో రూ.93,010 వద్ద ట్రేడవుతోంది. ఆ క్రమంలోనే ఇది రూ.93,736 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది.


గత ముగింపు కంటే

అదేవిధంగా మే 5, 2025న వెండి ఫ్యూచర్స్ కూడా ఈరోజు లాభల్లో కొనసాగింది. MCXలో ఈ ఒప్పందం కిలోకు రూ.92,000 వద్ద మొదలై, ఇది గత ముగింపు రూ.91,595 నుంచి రూ.405 లాభపడింది. ఇది మునుపటి ముగింపు కంటే రూ. 703 లేదా 0.77 శాతం లాభం పొందడం విశేషం. ఈ క్రమంలో ఇది రూ. 92,000 కనిష్ట స్థాయిని, రూ. 92,588 గరిష్ట స్థాయిని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో COMEX బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు దాదాపు $3,2-7.2 వద్ద ట్రేడవుతోంది. బంగారం ఫ్యూచర్లు ఔన్సుకు $3,200 మార్కును దాటడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉదయం 10:45 గంటలకు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు $3,195.83గా ఉంది.


ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఇక్కడ చూద్దాం.

  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 95,550కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 87,600గా ఉంది.

  • ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 95,400 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 87,450గా కలదు.

  • హైదరాబాద్, విజయవాడలో కూడా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 95,400 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 87,450గా కలదు.

  • కోల్‌కతాలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 95,400 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,450 వద్ద ఉంది

  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 95,400 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 87,450 వద్ద ఉంది

వెండి ధరలు

  • దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97,100గా ఉంది.

  • ముంబైలో ఈ విలువైన లోహాన్ని కొనడానికి వినియోగదారులు ఈరోజు కిలోకు రూ. 97,100 చెల్లించాల్సి ఉంటుంది

  • కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 98,000, చెన్నైలో ఈ విలువైన లోహం ధర కిలోకు రూ. 1,08,000 స్థాయిలో ఉంది.

  • హైదరాబాద్, విజయవాడలో కూడా కేజీ వెండి ధర రూ. 1,08,000గా ఉంది.


ఇవి కూడా చదవండి:

Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్

SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా


Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 11 , 2025 | 01:07 PM