Gold Prices Surge: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు..లక్షకు చేరుతుందా..
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:18 PM
భారతీయులకు చాలా ఇష్టమైన బంగారం..సామాన్యూలకు షాక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు వరుసగా నాలురోజు కూడా పెరిగాయి.ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో గత రికార్డులను అధిగమించాయి. ఈ వారంలో మొదటి రెండు రోజుల్లో తగ్గిన రేట్లు, ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 12 నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 పెరిగి రూ.95,670కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.87,700కి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధరలు రూ.210 పెరిగి 10 గ్రాములకు రూ.71,760 స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.97,100 స్థాయికి చేరుకుంది.
లక్షకు చేరుతుందా..
ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పటివరకు 6.6% పెరగడం విశేషం. మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లో పసిడి ధరలు లక్ష రూపాయలకు చేరనున్నాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా, రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించడంతో స్పాట్ గోల్డ్ నిన్న USD 3,200 స్థాయిని దాటింది. అమెరికా డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం కనిష్ట స్థాయిలో 99.78 ఉన్న నేపథ్యంలో ఇది బంగారం ధరల పెరుగుదలకు సపోర్ట్ చేస్తుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:
చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,670; 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,700.
బెంగళూరు: 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,700; 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,670.
హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,700; 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,670.
ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.87,700; 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.95,670.
ఇవి కూడా చదవండి:
కోతి కోసం వీళ్ల సాహసానికి సెల్యూట్
Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News