ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

ABN, Publish Date - Jan 11 , 2025 | 07:24 PM

మీ పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు ప్రస్తుత వయస్సులోనే నెలకు కొంత సేవింగ్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే రిటైర్ మెంట్ సమయానికి రెండు కోట్ల రూపాయలు కావాలంటే నెలకు ఎంత పెట్టుబడి చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Investment tips

పదవీ విరమణ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మైలురాయి అని చెప్పవచ్చు. జీవితాంతం పనిచేసి, కుటుంబాన్ని పోషిస్తూ, సమాజంలో మనదైన స్థానాన్ని సాధించడం ఓ గొప్ప సంతోషం. కానీ పదవీ విరమణ తర్వాత మన జీవితాన్ని ఎలా ఎదుర్కొవాలనేది అనేక మందికి ఎదురయ్యే ప్రశ్న. ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా మనం ఆర్థిక స్వాతంత్రం పొందాలంటే మాత్రం ఇప్పటి నుంచే ఎంతో కొంత సేవ్ చేస్తే బెటర్. ప్రస్తుత వయస్సులోనే మీరు నెలకు కొంత సేవింగ్ పెట్టుబడులు (Investment Plan) చేస్తే పదవీ విరమణ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అయితే రిటైర్ మెంట్ సమయానికి రెండు కోట్ల రూపాయలు కావాలంటే నెలకు ఎంత పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లే చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


క్రమంగా పెరగనున్న మొత్తం

దీనికి సిప్ పెట్టుబడులు (SIP - Systematic Investment Plan) బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. సిప్‌లో సాధారణంగా కాంపౌండ్ ఇంటరెస్ట్ విధానంలో మీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతుంటాయి. కాబట్టి ఉదాహరణకు మీరు నెలకు రూ. 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే, మీరు రెండు కోట్ల రూపాయల కోసం 22 ఏళ్లు పెట్టుబడి చేయాలి. ఆ క్రమంలో మీకు 15 శాతం వార్షిక వడ్డీ చొప్పున మీకు 22 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ. 2,07,06,590 అవుతుంది. మీరు చేసిన పెట్టుబడి 26,40,000 కాగా, ఆ క్రమంలో మీకు వడ్డీ రూపంలోనే రూ. 1,80,66,590 లభిస్తాయి.


పెట్టుబడులు ఎలా పనిచేస్తాయంటే..

మీరు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పటి నుంచి పరిమిత కాలంలో వచ్చిన వడ్డీ మొదటి వారం నుంచే మొత్తం పెట్టుబడిని ప్రభావితం చేస్తాయి. ప్రతి నెలలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ, జత చేసుకున్న వడ్డీ వృద్ధి చెందుతుంది. దీంతో ఈ మొత్తం క్రమంగా పెరుగుతుంది. దీంతో మీరు 22 ఏళ్ల పాటు చేసిన పెట్టుబడి మొత్తం మీ పదవీ విరమణ సమయానికి రెండు కోట్ల రూపాయలకుపైగా వచ్చేస్తుంది. కాలక్రమేణా పెరిగిన మీ పెట్టుబడులు భారీగా పెరుగుతాయని చెప్పవచ్చు.


ప్రతి నెలా రూ. 10,000

దీంతో మీరు ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి చెల్లించడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీకు 22 ఏళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రణాళిక విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి. పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి చిన్న చిన్న మొత్తాలతో క్రమబద్ధమైన ప్లాన్ వేసుకుంటే మీకు మంచి మొత్తం లభిస్తుంది.

గమనిక: ఆంధ్రజ్యోతి వీటిలో పెట్టుబడులు చేయాలని సలహా ఇవ్వదు. సమాచారం మాత్రమే ఇస్తుంది. మీకు పెట్టుబడి చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం తప్పనిసరి.


ఇవి కూడా చదవండి:

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 11 , 2025 | 07:26 PM