Share News

iPhone Shipment Trump Tariffs: ఐదు విమానాల నిండా ఐఫోన్లను భారత్ నుంచి అమెరికాకు తరలింపు

ABN , Publish Date - Apr 08 , 2025 | 09:42 PM

ట్రంప్ సుంకాల నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులపై భారం పెరిగే లోపే వివిధ దేశాల నుంచి ఐఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో భారత్ నుంచి ఐదు విమానాల్లో ఐఫోన్లను తరలించినట్టు సమాచారం.

iPhone Shipment Trump Tariffs: ఐదు విమానాల నిండా ఐఫోన్లను భారత్ నుంచి అమెరికాకు తరలింపు
iPhone Shipment Trump Tariffs

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలతో ఐఫోన్‌ల ధరలు పెరగనున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను కొంతకాలమైన వాయిదా వేసేందుకు వీలుగా వివిధ దేశాల్లోని ప్లాంట్స్ నుంచి ఐఫోన్లను అమెరికాకు తెప్పించుకుంటోంది. ఈ క్రమంలో భారత్‌ నుంచి ఏకంగా ఐదు విమానాల్లో యాపిల్ ఫోన్స్‌ను అమెరికాకు తరలించినట్టు సమాచారం. ఈ నిల్వలు రాబోయే కొన్ని నెలల విక్రయాలకు సరిపోతాయని తెలుస్తోంది.

ట్రంప్ సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 10 శాతం కనీస పరిమితి అమలవుతున్నప్పటికీ రేపటి నుంచీ పూర్తిస్థాయి సుంకాలు అమల్లోకి వస్తాయి. ఈలోపే యాపిల్ వివిధ దేశాల నుంచి ఐఫోన్‌లను అమెరికాకు తరలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పూర్తిస్థాయి సుంకాలు అమ్మల్లోకి రాకమునుపే అమెరికాకు విదేశీ ప్లాంట్‌ల నుంచి ఐఫోన్లను దిగుమతి చేసుకుంటే అమెరికా కస్టమర్లకు ప్రస్తుత ధరలకే ఫోన్లను విక్రయించే అవకాశం ఉంటుంది.


అయితే, ట్రంప్ విధించిన సుంకాల భారం ఏదోక సమయంలో యాపిల్‌ కస్టమర్లకు బదిలీ చేయకతప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే ధరలను పెంచే ఉద్దేశంలో కంపెనీ లేదని తెలుస్తోంది. మరోవైపు, సుంకాల భారాన్ని తాము ఎంతకాలం భరించగలమనే విషయంపై కూడా యాపిల్ సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, ట్రంప్ సుంకాలు భారత్‌కు లాభించే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చైనా నుంచి దిగుమతులపై అమెరికా 54 శాతం సుంకాన్ని విధిస్తోంది. భారత దిగుమతులపై మాత్రం 26 శాతం సుంకం అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎన్‌సీలు తమ మ్యాన్యుఫాక్చింగ్ ప్లాంట్‌లను చైనా నుంచి భారత్‌కు విస్తరించే అవకాశం ఉంది.


ఇప్పటికే భారత్ అమెరికాకు 9 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేస్తోంది. ఇక అమెరికా కస్టమర్లకు ఐఫోన్ ధరలు పెరగకుండా ఉండేందుకు యాపిల్ తన ఐఫోన్‌ ఉత్పత్తిని వీలైనంత త్వరగా భారత్‌‌కు మళ్లించాల్సి ఉంటుందని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 08 , 2025 | 10:19 PM