Share News

Viral News: ఫేమస్ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకుల్చిన ఎలుక..ఏమైందంటే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:41 PM

ఓ ప్రముఖ రెస్టారెంట్ సిబ్బంది చేసిన చిన్న నిర్లక్ష్యం..ఇప్పుడు ఆ కంపెనీకి భారీగా నష్టాలను తెచ్చాయి. ఎలాగంటే ఏకంగా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: ఫేమస్ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకుల్చిన ఎలుక..ఏమైందంటే..
Japanese Famous Restaurant Stocks Plunge

కంపెనీల లాభాలు తగ్గినప్పుడు స్టాక్ మార్కెట్లో ఆయా సంస్థల షేర్ల ధరలు తగ్గిపోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. దీంతోపాటు ప్రప్రంచవ్యాప్తంగా యుద్ధం, మాంద్యం భయాందోళనలు కూడా స్టాక్ మార్కెట్లో పలు కంపెనీలపై ప్రభావం చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల మాత్రం ఓ చనిపోయిన ఎలుక ప్రముఖ రెస్టారెంట్ స్టాక్స్ కూప్పకూలిపోయేలా చేసింది. అవును మీరు చదివింది నిజమే. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అసలు ఏం జరిగిందంటే..

జపాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ చైన్.. సుకియా హోల్డింగ్స్ బ్రాంచులో ఓ కస్టమర్ సూప్‌ తాగుతున్న క్రమంలో అందులో ఎలుకను గుర్తించాడు. ఆ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ దీనిపై ఓనర్లకు కంప్లైంట్ చేశాడు. దీనిపై స్పందించిన సుకియా సంస్థ ఫిబ్రవరి 13న ఈ విషయంపై క్షమాపణలు చెప్పింది. ఆ రోజు సూప్ తయారు చేసే సమయంలో ఎలుక సూప్‌లోకి ప్రవేశించిందని, కానీ మా సిబ్బంది దాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది.


సోషల్ మీడియాలో వైరల్

ఆ తర్వాత అనేక వార్తాపత్రికలు, సోషల్ మీడియా ఈ రెస్టారెంట్లో జరిగిన విషయాన్ని బహిర్గతం చేశాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. జపనీస్ రెస్టారెంట్ చైన్ అయిన సుకియా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 శాఖలను నిర్వహిస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు వారి బ్రాండ్ విలువను దెబ్బతీశాయని చెప్పవచ్చు. చాలా మంది కస్టమర్లు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు.


స్టాక్ మార్కెట్ ప్రభావం

ఆ క్రమంలో సుకియా సంస్థ "జెన్‌షో హోల్డింగ్స్" షేర్లు 7.1 శాతం వరకు పడిపోయాయి. ఇటీవల జెన్షో షేర్లు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో జెన్షో హోల్డింగ్స్ నష్టపోతుందని భావిస్తున్నారు. కానీ కొన్ని విశ్లేషకులు మాత్రం ఇది కేవలం తాత్కాలికమైనదిగా భావిస్తున్నారు. సుకియా ఈ సంఘటన తర్వాత తాము అందించే ఆహారంలో పరిశుభ్రతను మరింతగా పెంచుతున్నట్లు చెప్పింది. పరిశుభ్రత చర్యలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇది నిజంగా సంస్థపై తర్వాత కూడా ప్రభావం చూపిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - Mar 24 , 2025 | 09:41 PM