Share News

జోస్‌ అలుక్కాస్‌ ఆత్మకథ ‘గోల్డ్‌’

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:40 AM

ఆభరణాల రిటైల్‌ విభాగంలో కేరళలోని త్రిసూర్‌ స్వర్ణ వారసత్వాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో జోస్‌ అలుక్కాస్‌ చేసిన కృషి అమోఘమైనదని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి అన్నారు...

జోస్‌ అలుక్కాస్‌ ఆత్మకథ ‘గోల్డ్‌’

ఆవిష్కరించిన కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఆభరణాల రిటైల్‌ విభాగంలో కేరళలోని త్రిసూర్‌ స్వర్ణ వారసత్వాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో జోస్‌ అలుక్కాస్‌ చేసిన కృషి అమోఘమైనదని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి అన్నారు. త్రిసూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జోస్‌ అలుక్కాస్‌ ఆత్మ కథ ‘గోల్డ్‌’ను మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్‌ గోపి మాట్లాడుతూ.. బంగారం వ్యాపారంలో త్రిసూర్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, దాన్ని జోస్‌ అలుక్కాస్‌ కొనసాగించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం జోస్‌ అలుక్కాస్‌ మాట్లాడుతూ.. త్రిసూర్‌ నుంచి తాను వ్యాపారాన్ని ప్రారంభించి శాఖోపశాఖలుగా విస్తరించినట్లు చెప్పారు. తన 81 ఏళ్ల జీవితం వ్యక్తిగతమైనదే కాదని, భారతీయ ఆభరణాల వ్యాపార చరిత్ర కూడా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోజోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్త ఆర్‌ మాధవన్‌, కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కే రాజన్‌, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌ బిందు సహా జోస్‌అలుక్కాస్‌ ఎండీలు వర్ఘీస్‌ అలుక్కాస్‌, పాల్‌ జే అలుక్కాస్‌, జాన్‌ అలుక్కాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:40 AM