Share News

జంటగా గృహ రుణం తీసుకుంటున్నారా!

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:35 AM

మన దేశంలోనూ ఉమ్మడి గృహ రుణాలు పెరిగి పోతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కునేందుకు లేదా కట్టుకునేందుకు యువ దంపతులు, ముఖ్యంగా వేరు కాపురాలు పెట్టుకునే జంటలు ఈ తరహా గృహ రుణాలకు మొగ్గు...

జంటగా గృహ రుణం తీసుకుంటున్నారా!

అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మన దేశంలోనూ ఉమ్మడి గృహ రుణాలు పెరిగి పోతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కునేందుకు లేదా కట్టుకునేందుకు యువ దంపతులు, ముఖ్యంగా వేరు కాపురాలు పెట్టుకునే జంటలు ఈ తరహా గృహ రుణాలకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు ఇలాంటి రుణాలతో కుటుంబంపై కొంత భారం తగ్గుతుందని కొందరు.. బాధ్యతాయుతంగా వ్యవహరించ వచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే ఈ రుణాల చెల్లింపు బాధ్యత ఒకరికి బదులు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది తీసుకుంటారు. ఈ ఉమ్మడి గృహ రుణాల్లో అనేక సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. అవేమిటంటే..


అనుకూలతలు

అధిక రుణ అర్హత: ఇద్దరి ఆదాయాలు కలపడంతో అధిక రుణ అర్హత ఏర్పడుడుతుంది. దాంతో ఖరీదైన ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుక్కోవడం తేలిక అవుతుంది.

చెల్లింపు బాధ్యత: ఉమ్మడి గృహ రుణాల చెల్లింపు బాధ్యత ఒకరి కంటే ఎక్కువ మందిపై ఉంటుంది. దీంతో సమయానికి రుణ కిస్తీలు చెల్లించడాన్ని సహ దరఖాస్తుదారులు అందరూ బాధ్యతగా స్వీకరిస్తారు.

అధిక అవకాశాలు: ఇద్దరు ముగ్గురి ఆదాయాలు స్పష్టంగా కనిపించడంతో బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు ఉమ్మడి గృహ రుణాల దరఖాస్తులను ఆమోదించే అవకాశాలు ఎక్కువ.

పన్ను ప్రయోజనాలు

ఉమ్మడిగా గృహ రుణం తీసునే అందరికీ సెక్షన్‌ 80సీ కింద, 24 (బీ) కింద పన్ను పయోజనాలు లభిస్తాయి.

మహిళలకు తక్కువ వడ్డీ రేటు: ఫస్ట్‌ కో అప్లికెంట్‌ లేదా ప్రధాన అప్లికెంట్‌ మహిళలు అయి ఉంటే వడ్డీ రేటు కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది.


ప్రతికూలతలు

చెల్లింపు సమస్యలు: ఉమ్మడి గృహ రుణ ఈఎంఐల చెల్లింపు బాధ్యత అందరిపై సమానంగా ఉంటుంది. ఈ విషయంలో ఏ ఒక్కరు విఫలమైనా ఆ భారం మిగతా వారిపై పడుతుంది.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం: ఈఎంఐల చెల్లింపులో విఫలమైనా లేదా ఆలస్యమైనా అది ఉమ్మడిగా రుణం తీసుకున్న అందరి పరపతి స్కోరును దెబ్బతీస్తుంది. దాంతో భవిష్యత్‌లో ఏమైనా రుణాలు తీసుకోవాల్సి వస్తే, సమస్యలు వస్తాయి.

రుణ సేకరణ సామర్ధ్యం తగ్గిపోవడం: ఉమ్మడి గృహ రుణం చెల్లించడం సహ దరఖాస్తుదారులు అందరి బాధ్యత.ఈ బాధ్యత పూర్తయ్యే వరకు వీరికి ర వ్యక్తిగత రుణాలు పెద్దగా లభించవు.


ఆర్థిక సవాళ్లు: ఇవి దీర్ఘకాలిక రుణాలు. వీటి చెల్లింపులు పూర్తయ్యే సరికి దాదాపు పాతిక, ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది. ఈ లోపు ఉద్యోగాలు పోవడం, ఆర్థిక మాంద్యం, ఇతర సమస్యలు ఏర్పడితే చెల్లింపు సమస్యలు ఏర్పడి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

వివాదాలు న్యాయ సమస్యలు: ఈ రుణాల చెల్లింపునకు సంబంధించి సహ అప్లికెంట్స్‌ మధ్య చక్కటి సఖ్యత, సమన్వయం ఉండాలి. లేకపోతే వివాదాలు, కోర్టు కేసులు, అపోహలు తలెత్తి మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Updated Date - Apr 13 , 2025 | 02:36 AM