Reliance Capital : రిలయన్స్ క్యాపిటల్ దివాలా సుఖాంతం
ABN, Publish Date - Mar 22 , 2025 | 12:53 AM
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది.

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది. హిందుజాల నేతృత్వంలోని ఇండ్‌సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎల్) రూ.10,000 కోట్లతో ఈ కంపెనీని దక్కించుకుంది. రుణదాతలు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదాలూ పూర్తయ్యాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డునీ పునర్ వ్యవస్థీకరించారు. దీంతో ఈ నెల 19న రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తయిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తానికి వై నాగేశ్వర రావు దివాలా పరిష్కార పరిష్కర్తగా వ్యవహరించారు. దేశంలో దివాలా పరిష్కార ప్రక్రియకు వచ్చిన తొలి ఎన్‌బీఎఫ్‌సీ కూడా రిలయన్స్ క్యాపిటలే.
Updated Date - Mar 22 , 2025 | 12:55 AM