Stock Market: రూట్ మార్చిన ఎఫ్‌ఐఐలు.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:03 PM

వరుసగా అమ్మకాలు సాగిస్తూ వస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం రూటు మార్చారు. మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఆ సానుకూలాంశంతో బుధవారం ఉదయం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అయితే మధ్యాహ్నం తర్వాత కాస్త కుదుపునకు లోనై లాభాలను కోల్పోయాయి.

Stock Market: రూట్ మార్చిన ఎఫ్‌ఐఐలు.. ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Market

వరుసగా అమ్మకాలు సాగిస్తూ వస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం రూటు మార్చారు. మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఆ సానుకూలాంశంతో బుధవారం ఉదయం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అయితే మధ్యాహ్నం తర్వాత కాస్త కుదుపునకు లోనై లాభాలను కోల్పోయాయి. చివరకు ఫ్లాట్‌గా రోజును ముగించాయి. వరుసగా నష్టపోతూ వస్తున్న మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మాత్రం లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. (Business News).


మంగళవారం ముగింపు (75, 967)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. ఒక దశలో 350 పాయింట్లకు పైగా లాభంతో 76 వేల పైకి ఎగబాకింది. 76, 338 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలను కోల్పోయింది. చివరకు 28 పాయింట్ల స్వల్ప నష్టంతో 75, 939 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 22, 932 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో బీఎస్‌ఈ లిమిటెడ్, మనప్పురం ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్‌ఎఫ్‌సీఎల్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఫియోనిక్స్ మిల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా, వరుసగా భారీ నష్టాలను చవిచూస్తున్న స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు బుధవారం భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 775 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 482 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.95గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2025 | 04:03 PM