Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ఉన్న టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN, Publish Date - Jan 13 , 2025 | 10:13 AM
గత వారం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న సూచీలు ఈ వారాన్ని కూడా అదే ధోరణితో ప్రారంభించాయి. సోమవారం ఉదయం అన్ని సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం ఐదు వందల పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను చవిచూస్తోంది
విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు మొదలైనవి దేశీయ సూచీలను కుంగదీస్తున్నాయి. గత వారం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న సూచీలు ఈ వారాన్ని కూడా అదే ధోరణితో ప్రారంభించాయి. సోమవారం ఉదయం అన్ని సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం ఐదు వందల పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను చవిచూస్తోంది (Business News).
గత శుక్రరం ముగింపు (77, 378)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయింట్లు కోల్పోయి 76, 535వ కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. చాలా రోజుల తర్వాత 77 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10: 10 గంటల సమయంలో 523 పాయింట్లు కోల్పోయి 76, 855 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 10:10 గంటల సమయంలో 186 పాయింట్ల నష్టంతో 23, 242 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో బయోకాన్, వొడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్, ఏబీ క్యాపిటల్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. హిందుస్థాన్ పెట్రో, కల్యాన్ జ్యువెల్లర్, సీఈఎస్‌సీ, మార్కోటెక్ డెవలపర్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 792 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 319 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.34గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 13 , 2025 | 10:13 AM