Stock Market: దేశీయ సూచీలకు బంపర్ బూస్ట్.. సెన్సెక్స్ 1500 పాయింట్లు జంప్..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:27 PM
వివిధ దేశలపై టారిఫ్‌లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ప్రకటించడంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాయతీ మార్కెట్లలో సానుకూలాంశాలతో పాటు చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి.

ఇటీవల వరుస నష్టాలతో కునారిల్లిన దేశీయ సూచీలు రికవరీ బాట పట్టాయి. భారీ లాభాలను ఆర్జించాయి. ఆకర్షణీయంగా ఉన్న హెవీ వెయిట్ షేర్లతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు తీయించాయి. వివిధ దేశలపై టారిఫ్‌లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ప్రకటించడంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాయతీ మార్కెట్లలో సానుకూలాంశాలతో పాటు చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి. (Business News).
గత శుక్రవారం ముగింపు (75, 157)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 1600 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత రోజంతా అదే ధోరణిలో కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 77 వేల సమీపానికి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 1577 పాయింట్ల లాభంతో 76, 734 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఏకంగా 500 పాయింట్ల లాభంతో 23, 328 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ఇండియన్ రెన్యుబుల్, మార్కోటెక్ డెవలపర్స్, మదర్సన్ షేర్లు లాభాలను ఆర్జించాయి. మ్యాక్స్ హెల్త్‌కేర్, పీఎన్‌బీ హౌసింగ్, హిందుస్తాన్ పెట్రో, బెర్గర్ పెయింట్స్ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1472 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.77 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..