Gold, Silver Rate: భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:07 AM
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. గత కొన్నాళ్లుగా భారీగా పెరుగుతు పోతున్న పుత్తడి ధరకు రెండు మూడు రోజుల నుంచి బ్రేక్ పడింది. నెమ్మదిగా దిగి వస్తోంది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగార రేటు ఎంత ఉందంటే..

ముంబై: మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే ఇతర లోహానికి ఉండదు. మరీ ముఖ్యంగా మహిళలకు అయితే గోల్డ్ అంటే అమితమైన ప్రేమ. ఎంత కొన్నా.. ఉన్నా సరిపోదు. ఒకప్పుడు పసిడి ధరలు సామాన్యులకు సైతం అందుబాటులోనే ఉండేవి. కానీ గత కొన్నాళ్లుగా పుత్తడి ధర రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం గోల్డ్ రేటు చుక్కలను తాకుతుంది. పది గ్రాముల పసిడి రేటు.. 95 వేల రూపాయలకు పైబడి పలుకుతుంది. త్వరలోనే బంగారం ధర తులం లక్ష రూపాయలు కానుంది అంటున్నారు. ఇది ఇలా ఉంటే.. రెండు మూడు రోజుల నుంచి గోల్డ్ రేటు దిగి వస్తోంది. మరి నేటి ధర ఎంత ఉందంటే..
హైదరాబాద్‌లో ఇలా..
గత రెండు మూడు రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు స్వల్పంగా దిగి వచ్చింది. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో పసిడి ధర తగ్గింది. క్రితం సెషన్‌లో భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు 95,180 రూపాయలుగా ఉండగా.. నేడు అనగా ఏప్రిల్ 16, బుధవారం నాడు స్వల్పంగా తగ్గి.. 95,170 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలానే మంగళవారం నాడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర 87,200 రూపాయలు ఉండగా.. నేడు బుధవారం నాడు స్వల్పంగా తగ్గి రూ.87,190 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా పసిడి ధరలు..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పుత్తడి ధర దిగి వచ్చింది. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ.87,340 ఉండగా.. 24 క్యారెట్ గోల్డ్ రేటు 95,320 రూపాయలుగా ఉంది. అలానే ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు 87,190 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 95,170 రూపాయలుగా ఉంది.
వెండి ధర..
నేడు బంగారం ధర దిగి రాగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది. ఇవాళ(ఏప్రిల్ 16) సిల్వర్ రేటు తగ్గింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర 1,09,700 రూపాయలు ఉంది. క్రితం సెషన్‌లో హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు 1,09,800 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో వెండి రేటు.. హైదరాబాద్ కన్నా తక్కువగా ఉంది. హస్తినలో కిలో సిల్వర్ రేటు 99,700 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నలో బుధవారం నాడు కిలో వెండి ధర 1,09,700 రూపాయలుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..