Trump Tariffs Impact: రూ.11.30 లక్షల కోట్లు పోయే
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:50 AM
ట్రంప్ అదనపు సుంకాలు ప్రకటించినప్పటి నుంచి మదుపరులు రూ.11.30 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది

ట్రంప్ సుంకాలు ప్రకటించినప్పటి నుంచి మదుపరులు కోల్పోయిన సంపద ఇది..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు బీఎ్‌సఈ సెన్సెక్స్ 1,460.18 పాయింట్లు (1.90 శాతం) క్షీణించింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11.30 లక్షల కోట్లకు పైగా తరిగిపోయి ప్రస్తుతం రూ.401.67 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నెల 2న ట్రంప్ భారత్ సహా 60కి పైగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించారు. ఈ నెల 9 నుంచి అమలులోకి రావాల్సిన సుంకాలను మళ్లీ 90 రోజుల పాటు వాయిదా వేశారు. చైనాపైన మాత్రం సుంకాలను 145 శాతానికి పెంచి మరీ అమలు చేశారు. అందుకు ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై సుంకాలను 125 శాతానికి పెంచింది.