అమెరికా మార్కెట్లు క్రాష్!
ABN , Publish Date - Apr 04 , 2025 | 02:54 AM
ట్రంప్ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చన్న ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్ ఒకదశలో 1,278 పాయింట్లు (3.03 శాతం) క్షీణించగా...

డౌజోన్స్ 3 శాతానికి పైగా డౌన్
9% క్షీణించిన యాపిల్ షేరు
బంగారం, వెండి, క్రూడ్ సైతం..
ట్రంప్ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చన్న ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్ ఒకదశలో 1,278 పాయింట్లు (3.03 శాతం) క్షీణించగా.. ఎస్ అండ్ పీ 500 సూచీ 3.81 శాతం, నాస్‌డాక్ 4.88 శాతం నష్టపోయాయి. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ షేరు ఒకదశలో 8.75 శాతం క్షీణించగా.. ఎన్‌విడియా 6.75 శాతం, గూగుల్ 3.15 శాతం, టెస్లా 4.72 శాతం తగ్గాయి. యూరోపియన్ మార్కెట్లు సైతం 3.60 శాతం వరకు నష్టపోయాయి. అంతేకాదు, ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ బంగారం సైతం 42 డాలర్ల మేర తగ్గి 3,123 డాలర్ల స్థాయికి, సిల్వర్ 32 డాలర్ల వద్దకు జారుకోగా.. బ్రెంట్ ముడిచమురు పీపా ధర 70 డాలర్లకు పడిపోయింది.
Read Also: ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి
Today Gold Rate: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..