Cell Phone: విద్యార్థిని ప్రాణంతీసిన సెల్‌ఫోన్.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Apr 08 , 2025 | 01:26 PM
సెల్‌ఫోన్ ఓ విద్యార్థిని ప్రాణంతీసింది. ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రంలో ఉన్న తన తండ్రితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆదమరిచి డాబాపై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
-సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ మిద్దెపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి
చెన్నై: సెల్‌ఫోన్‌లో తండ్రితో మాట్లాడుతున్న విద్యార్థిని హఠాత్తుగా మిద్దెపై నుంచి జారిపడి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. తిరునల్వేలి జిల్లా మేలూరు సమీపంలోని మానూరులోని ఓ కళాశాలలో చదువుతున్న కలైసెల్వి తల్లిదండ్రులు గుజరాత్(Gujarath)లో వ్యాపారం చేస్తున్నారు. కలైసెల్వి అవ్వ ఇంట్లో ఉంటోంది. ఈ నెల 1వ తేది ఇంటి మిద్దెపై సెల్‌ఫోన్(Cell Phone)లో తండ్రితో మాట్లాడుతున్న కలైసెల్వి హఠాత్తుగా కాలుజారి కిందపడింది.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
తీవ్రంగా గాయపడిన ఆమెను చుట్టుపక్కల వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతిచెందింది. తల్లిదండ్రుల అనుమతితో కలైసెల్వి అవయవాలు దానంగా తీసుకున్న వైద్యులు, ఆమె మృతదేహానికి ప్రభుత్వం తరఫున నివాళులర్పించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News
Updated Date - Apr 08 , 2025 | 01:26 PM