Indiana Foster kid Death: 10 ఏళ్ల బాలుడి ఛాతిపై కూర్చొన్న తల్లి.. చిన్నారి దుర్మరణం
ABN, Publish Date - Mar 11 , 2025 | 04:02 PM
10 ఏళ్ల బాలుడి ఛాతిపై అతడి తల్లి కూర్చోవడంతో చిన్నారి మృతి చెందిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితురాలికి కోర్టు తాజాగా ఆరు నెలల కారాగార శిక్ష విధించింది.

ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల వయసున్న బాలుడిపై కూర్చుని అతడి మరణానికి కారణమైన అమరికా మహిళకు తాజాగా ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండియానా రాష్ట్రం వాల్‌పరాయ్‌సోకు చెందిన 48 ఏళ్ల జెన్నిఫర్ లీ విల్సన్ ఓ బాలుడిని పెంచుకుంటోంది. అతడి పేరు డకోటా లీ స్టీవెన్సన్. 2023, ఏప్రిల్ 25న ఆ బాలుడు ఇంట్లోంచి పారిపోయి పొరుగింటికి వెళ్లాడు. జెన్నిఫర్ అతడిని మళ్లీ వెనక్కు తీసుకొచ్చింది (USA).
అయినా పిల్లాడి అల్లరి మాత్రం తగ్గలేదు. తాను వెళ్లిపోతా అంటూ గొడవ చేయడం ప్రారంభించాడు. దీంతో, జెన్నిఫర్ బాలుడిని కింద పడేసి అతడు కదలకుండా మీద ఎక్కి కూర్చుంది. ఆ తరువాత ఐదు నిమిషాలకు అతడు అచేతనంగా మారిపోయాడు. దీంతో, గాబరా పడ్డ ఆమె అత్యవసర సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు అక్కడే కన్నుమూశాడు. ఈ కేసులో జెన్నిఫర్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఓ వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఆమెకు ఆరు నెలల కారాగార శిక్ష, ఆపై ఏడాది పాటు ప్రొబేషన్ విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.
Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం
కాగా, తాము జెన్నిఫర్ ఇంటికి వెళ్లి చూడగా అతడు అచేతనంగా కనిపించారని అధికారులు తెలిపారు. అతడి గొంతు, ఛాతిపై స్వల్ప గాయాలు కనిపించాయని తెలిపారు. అతడిని స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నించినా బాలుడిలో ఎటువంటి చలనం కనిపించలేదని అన్నారు. కాగా, డకోటా నిత్యం ఇంట్లో పారిపోతుండేవాడని జెన్నిఫర్ చెప్పుకొచ్చింది. ఘటన జరిగిన రోజున కూడా పొరుగింట్లో ఉన్న అతడిని వెనక్కు తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆ తరువాత అతడు కింద పడి మారాం చేశాడని, వెళ్లిపోతా అని పట్టుబట్టాడని చెప్పింది. దీంతో, అతడిపై ఎక్కి కూర్చుని కదలకుండా చేసినట్టు అంగీకరించింది.
ఐదు నిమిషాల తరువాత అతడు అచేతనంగా అయిపోతే నాటకం ఆడుతున్నాడని అనుకున్నట్టు తెలిపింది. అతడి కళ్లను చూడగా పాలిపోయినట్టు కనిపించడంతో తాను సీపీఆర్ చేసి ఆ వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించినట్టు వెల్లడించింది. అతడిని ఇల్లు దాటకుండా చేయడం మినహా తనకు మరే ఉద్దేశం లేదని వెల్లడించింది.
Gold Price Dubai Vs India: భారత్‌తో పోలిస్తే దుబాయ్ బంగారం ధర ఎందుకు తక్కువంటే..
మరోవైపు, బాలుడు ఊపిరి తీసుకోలేక మరణించినట్టు పోస్టు మార్టం నివేదికలో తేలింది. అతడికి అంతర్గత గాయాలు అయినట్టు, లివర్, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. బాలుడి ఎత్తున 4 అడుగుల 10 అడుగులు కాగా మహిళ కూడా దాదాపు అంతే ఎత్తుందని పోలీసులు తెలిపారు. ఆమె బరువు మాత్రం ఏకంగా 154 కేజీలని అన్నారు.
ఘటనకు ముందు బాలుడు తన ఇంటికి వచ్చినట్టు పోరుగున్న ఉన్న వ్యక్తి తెలిపారు. తనను పెంచుకోవాలని, తన తల్లిదండ్రులు కొడుతున్నారని బాలుడు అన్నట్టు కూడా పేర్కొన్నారు. కానీ అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని తెలిపారు. ఆ తరువాత కాసేపటికి జెన్నిఫర్ భర్త వచ్చి బాలుడిని వెనక్కు తీసుకెళ్లాడని అన్నారు.
Updated Date - Mar 11 , 2025 | 04:07 PM