UP Man forced to Drink Poison: నగలు తిరిగిమ్మన్నాడని.. మాజీ ప్రియుడికి బలవంతంగా విషం తాగించి..
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:47 PM
బహుమానంగా ఇచ్చిన నగలు తిరిగిచ్చేయమని మాజీ ప్రియుడు కోరడంతో రెచ్చిపోయిన యువతి మరి కొందరితో కలిసి అతడిని దారుణంగా కొట్టి విషం తాగించింది. యూపీలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్లు లివిన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఆ తరువాత విడిపోయారు. ఒకప్పుడు ఇచ్చిన నగలు తిరిగివ్వాలని మాజీ ప్రేయసిని అతడు డిమాండ్ చేశాడు. అదే అతడి కొంప ముంచింది. మాజీ ప్రియుడిపై రెచ్చిపోయిన యువతి అతడిని తన స్నేహితులతో కలిసి చావచితక కొట్టి బలవంతంగా విషం తాగించింది. ప్రణాపాయంలో పడ్డ అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు (UP Man Forced To Drink Poison by Ex Girlfriend).
యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. హరీమ్‌పూర్‌కు చెందిన శైలేంద్ర గుప్త మహోబాలోని ఓ ప్రైవేటె కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం అతడికి కాలీపహాడీ గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం ప్రారంభించారు. అద్దె ఇంట్లో కలిసి ఉండేవాళ్లు. ఈ సందర్భంగా ఆమెకు శైలేంద్ర పలు ఖరీదైన నగలు, నాలుగు లక్షల రూపాయల నగదు ఇచ్చాడు.
Doctor Assaults In laws: బెంగళూరులో షాకింగ్ ఘటన.. వృద్ధులపై చేయి చేసుకున్న డాక్టర్ కోడలు..
కానీ కాలం గడిచేకొద్దీ వారి బంధం బలహీనపడింది. ఆమె ఇతరులతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. దీంతో, శైలేంద్ర ఆమెకు బ్రేకప్ చెప్పడమే కాకుండా గతంలో ఇచ్చిన నగలు డబ్బు తిరిచ్చేయమని డిమాండ్ చేశాడు. ఇది సుతారమూ నచ్చని ఆమె అతడికి బుద్ధి చెప్పేందుకు సాదాబ్ బెయిగ్, దీపక్, హ్యాపీలతో దాడికి ప్లాన్ చేసింది.
ఘటన జరిగిన రోజులు నగలు తీసుకునేందుకు శైలేంద్ర యువతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే సాదాబ్, దీపక్, హ్యాపీలు అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో నలుగురు కలిసి అతడిపై దాడి చేశారు. ఆపై బలవంతంగా విషం తాగించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలేంద్ర పలు తనపై దాడి చేసిన వారిపై పలు ఆరోపణలు చేశాడు. వారు తప్పుడు కేసులు పెడతామని తనను బెదిరించారని అన్నాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులో తాజాగా వెలుగు చూసిన మరో ఘటనలో ఓ కోడలు తన అత్తామామలను విచక్షణా రహితంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Man Killed over Holi: హోలీ రంగు పూస్తుంటే వద్దన్నాడని.. యువకుడిని లైబ్రరీలోనే దారుణంగా..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2025 | 01:49 PM