Share News

ఆ రాశివారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది..

ABN , Publish Date - Apr 13 , 2025 | 07:39 AM

ఆ రాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. మరికొన్ని రాశుల వారికి ఈ వారం సర్వత్రా అనుకూలంగా ఉంటుందని, అలాగే వారి ఆలోచనల్లో కొంత మార్పు వస్తుందని సూచిస్తున్నారు.

ఆ రాశివారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది..

అనుగ్రహం

13 - 19 ఏప్రిల్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ఈ వారం సర్వత్రా అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లిం పుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందు తుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితుల వుతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగేయండి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

మనోధైర్యంతో యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీస్సులు అందు కుంటారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ మరింత ఉత్సాహా న్నిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సన్నిహితుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వాహనం, గృహో పకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది,


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

తలపెట్టిన కార్యం సఫలమవు తుంది. అవకాశాలు కలిసివస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. స్థిరాస్తి మూల ధనం అందుతుంది. పెద్దమొత్తం ధన సహాయం తగదు. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందు కుంటారు. దూరపు బంధుత్వాలు బలపడ తాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. శుభకార్యంలో పాల్గొంటారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఆత్యీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నోటీసులు అందుకుంటారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

గ్రహసంచారం సామాన్యంగా ఉంది. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించు కుంటారు. శుభకార్యానికి హాజరవుతారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషి స్ఫూర్తి దాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింప చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మంగళ వారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

మనోభీష్టం సిద్థిస్తుంది. వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. కష్ఠమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

సర్వత్రా అనుకూలమే. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. శుక్ర, శనివారాల్లో గుట్టుగా మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావొద్దు. మీ యత్నాలకు కొందరు అవరోధం కలిగిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. నోటీసులు అందు కుంటారు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమా చారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సత్కాలం సమీపించింది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం, విలాసవస్తువులు కొను గోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. శ్రమ ఫలించకున్నా నిరుత్సా హపడవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడ తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. సామరస్యంగా మెల గండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 07:39 AM