Share News

Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:31 AM

నేడు 01-04-2025, మంగళవారం, కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు.

Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది

నేడు 01-04-2025, మంగళవారం, కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)డ

రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ఆలోచనలు ఆమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండం వల్ల మేలు జరుగుతుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఉమ్మడి నిధుల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నిహితుల కారణంగా మాటపడాల్సి రావచ్చు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కారణంగా మాటపడాల్సి రావచ్చు. బృందకార్యక్రమాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. వేడుకల్లో ఖర్చులు అధికం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి పరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలతో లావాదేవీలకు అనుకూలమైన రోజు. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. మీ గౌరవానికి భంగం కలిగించే పరిణామాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పారాయణ వల్ల మేలు జరుగుతుంది.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన మీ అంచనాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిరుత్సాకరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ వల్ల మంచి జరుగుతుంది.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైద్యం, మరమ్మతులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువై వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత పాటించాలి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం వల్ల మంచి జరుగుతుంది.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్య సాధనలో శ్రీవారు, శ్రీమతి సహకారం అందుకుంటారు. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పర మైన లక్ష్యాలు సాదిస్తారు. ప్రియతముల ఆ రోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వైద్య, సేవలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతమలుతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నారుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవల కోసం ఖర్చులు అధికం. లక్ష్మీనారసింహ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆడిటింగ్‌, ఆడ్వర్టయిజ్‌మెంట్‌, విద్యా రంగా వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. హనుమాన్‌ చాలీసా పారాయణ వల్ల మేలు జరుగుతుంది.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం క లిగిస్తాయి. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు సఫలం అవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Apr 01 , 2025 | 01:45 AM